Home రాజకీయాలు ఏంటేంటీ..కన్నాని భాజపా రాష్ట్ర అధ్యక్షుడుగా జగన్ సిఫారసు చేశాడా?

ఏంటేంటీ..కన్నాని భాజపా రాష్ట్ర అధ్యక్షుడుగా జగన్ సిఫారసు చేశాడా?

63
SHARE

ఇది తెదేపా వైసీపీ జగన్ లపై చేసే ఆరోపణలలో అమ్మ అని అనొచ్చు. తెదేపా ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ గొప్ప ఫిక్షన్ కధ అల్లారు. వైసీపీ అధినేత జగన్ సిఫారసుల మేరకు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కి కన్నా లక్ష్మీనారాయణ ను భాజపా నియమించిందని ఎమ్మెల్సీ వ్యాఖ్యానించారు.

తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ మరో మాట అన్నారు – ఏపీలో బీజేపీ భారతీయ జగన్ పార్టీగా తయారైందని అభివర్ణించారు. అంతేనా, వైకాపా బీజేపీ లది అపవిత్ర కలయిక అన్నారు. భాజపా కి వై ఎస్ జగన్ అద్డె మైకులా మారారంటూ వెటకారాలు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీకి జగన్ నిధులు అందించారని బాబు రాజేంద్రప్రసా ద్ ఆరోపించారు. ఎమ్మెల్సీ గారికి చాలా ఖాళి ఉన్నట్టు వుంది ఫిక్షన్ రాస్తున్నారు. సినిమాలకి ట్రై చేస్తే పోలా అంటూ వైకాపా నాయకులు కౌంటర్ లు ఇస్తున్నారు.