Home రాజకీయాలు వంచనపై వైయస్‌ఆర్‌ సీపీ గర్జన

వంచనపై వైయస్‌ఆర్‌ సీపీ గర్జన

70
SHARE

ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చడం, సాధించడంలో విఫలమైన బీజేపీ, టీడీపీలపై వైయస్‌ఆర్‌ సీపీ మరో పోరుకు సిద్ధమైంది. గత నాలుగు సంవత్సరాలుగా ప్రత్యేక హోదా కోసం  అలుపెరగని పోరాటం చేస్తున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వంచనకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది.

పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 14, 15 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు ‘వంచనపై గర్జన’ పాదయాత్రలు చేపట్టనున్నారు.

వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మండల కేంద్రాల్లో పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ మేరకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత గుడివాడ అమర్‌నాథ్‌ వివరాలు వెల్లడించారు. విశాఖపట్నం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. మండల కేంద్రాల్లో, విశాఖలో జరిగే సంఘీభావ పాదయాత్రను ప్రజలు విజయవంతం చేయాలని ఆయన కోరారు.