Home ప్రత్యేకం అమెరికాలో దుమ్మురేపుతున్న మహానటి

అమెరికాలో దుమ్మురేపుతున్న మహానటి

SHARE

తెలుగు వారి అభిమాన నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన మహనటి చిత్రానికి ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు. అమెరికాలో ఈ చిత్రం కలెక్షన్ల దుమారం రేపుతున్నది. యూఎస్‌లో ఈ ఏడాది రిలీజై.. అత్యధిక కలెక్షన్లు సాధించిన తెలుగు చిత్రాల జాబితాలో మహానటి చేరింది. తెలుగు రాష్ట్రాల్లోనూ కలెక్షన్ల మోత మోగిస్తున్నది.

ఈ చిత్రం అమెరికాలో రూ.7.5 కోట్లు వసూలు చేసింది. శుక్రవారం రాత్రి వరకు కూడా ఈ చిత్రం భారీ కలెక్షన్లను సాధిస్తున్నది. రానున్న రోజుల్లో కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశం కూడా ఉంది అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

మహానటి చిత్రాన్ని దర్శకుడు నాగ అశ్విన్ అద్బుతంగా తెరకెక్కించారు. మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్, జెమినీ గణేషన్ పాత్రలో దుల్కర్ సల్మాన్, ఇతర పాత్రల్లో సమంత, విజయ్ దేవరకొండ, రాజేంద్ర ప్రసాద్, మోహన్‌బాబు తదితరులు నటించారు.