Home రాజకీయాలు తెలుగోడి చేతిలో కర్ణాటకీయం…??

తెలుగోడి చేతిలో కర్ణాటకీయం…??

SHARE

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగి౦ది. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, జేడీఎస్‌ల మధ్య త్రికోణ పోటీ సాగుతున్నఎన్నికల సంరంభం ఎగ్జిట్ పోల్ ఎంతో ఆసక్తి రేపుతోంది. ప్రీ పోల్ సర్వేలన్నీ కూడా హంగ్ తప్పదు అని సెలవిచ్చాయి. మూడు పార్టీలూ ఈ తరహా ఫలితాలకే మెంటల్ గా ప్రిపేర్ ఔతున్నాయి.

తమ పార్టీని గెలిపించాలని.. లేకపోతే తను బతకలేను అని జేడీఎస్ నేత కుమారస్వామి ఆఖరి నిమిషంలో ప్రకటించడం సెంటిమెంట్ అస్త్రంగా మారింది. ఇప్పటి వరకూ అన్ని పార్టీలూ తమ తమ అస్త్రాలను సంధించేశాయి. హిందూత్వ వాద౦ బీజేపీ కి అస్త్రమైనా, రుణమాఫీ ఇతర హామీలతో మాంచ్చి ఆకర్షణీయమైన మేనిఫెస్టో ఒకటి ఆఖరి నిముషంలో విడుదల చేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది, కాంగ్రెస్ డెవలప్మెంట్ మంత్ర అంది. ముస్లింల ఓట్లు కురుబ, దళితుల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి సానుకూలాంశం.

కర్ణాటకలో మన తెలుగు వాళ్ల ఓట్లు కూడా ఎంతో కీలకం కాబోతున్నాయి. వీరిని ప్రసన్నం చేసుకోవడానికి అన్ని పార్టీలూ ప్రయత్నాలు గట్టిగానే చేశాయి. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీల తరఫున ఏపీ, తెలంగాణ నేతలు పోటాపోటీ ప్రచారాలు చేశారు.ఇన్ని పరిణామాల మధ్యన కర్ణాటక ఎన్నికలు, ఫలితాలు ఎంతో రసవత్తరంగా మారాయి.

ఎన్నికల తర్వాత బీజేపీ, జేడీఎస్‌లు చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని విశ్లేషణలు చెప్తున్నాయి. భాజపా కి ముఖ్యమంత్రి పదవి జేడీఎస్ కి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కవచ్చు అనే వాదన కూడా బయటకి వచ్చింది.