Home రాజకీయాలు అట్టహాసంగా పర్యాటక మంత్రి అఖిలప్రియ నిశ్చితార్ధం!

అట్టహాసంగా పర్యాటక మంత్రి అఖిలప్రియ నిశ్చితార్ధం!

78
SHARE

ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిల ప్రియ నిశ్చితార్థ వేడుక బహు అట్టహాసంగా జరిగింది. మాజీ డీజీపీ సాంబశివరావు అల్లుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన భార్గవ్‌ అఖిల ప్రియ కి స్నేహితుడు.

వారి సాన్నిహిత్యం ప్రేమ గా మారడంతో ఇరు కుటుంబాల వారు వివాహం చేయ తలపెట్టారు. అఖిలప్రియ కి వివాహం అయినా అది ఎక్కువ కాలం నిలవక విడాకులతో ముగిసింది. శోభా, నాగిరెడ్డి ల గారాలపట్టి అయిన అఖిలప్రియ అతి పిన్న వయసులోనే మంత్రి పదవి దక్కించుకున్నారు. నాగిరెడ్డి 2017 లో గుండెపోటు తో మరణించారు. శోభా నాగిరెడ్డి 2014 లో ఎన్నికల ప్రచారం చేసి వస్తూ ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. అప్పుడే ఆళ్లగడ్డ కి అఖిలప్రియ వైసీపీ తరఫున ఎన్నికైంది. పార్టీ మారి చిన్న వయసుకే మంత్రి పదవి దక్కించుకున్నారు.

ఇక అఖిల ప్రియా నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లోని ఆమె నివాసంలోనే జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి కేవలం అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు సమాచారం. అఖిలప్రియ-భార్గవ్‌ ల వివాహం ఆగస్టు 29న పెద్దలు నిశ్చయించారు.