Home రాజకీయాలు ఉండవల్లి ఇచ్చిన అవకాశాన్ని బాబు ఉపయోగించుకుంటాడా?

ఉండవల్లి ఇచ్చిన అవకాశాన్ని బాబు ఉపయోగించుకుంటాడా?

SHARE

తానింకా రాజకీయాలలో లేను అని చెప్పుకుంటూనే తరచూ కేవలం రాజకీయాలు మాత్రమే మాట్లాడుతుంటారు రాజమండ్రి మాజీ ఎంపీ కాంగ్రెస్ నాయకులు ఉండవల్లి అరుణ్ కుమార్.

తాజాగా ఉండవల్లి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఓ లేఖ సందించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనకు సంబంధించి సుప్రీంకోర్టులో తాను వేసిన పిటీషన్ కు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని తన లేఖలో పేర్కొన్నారు. తన విభజన పిటిషన్ పై కేంద్ర౦ ఇంతవరకు కౌంటర్ దాఖలు చేయలేదని కూడా పేర్కొన్నారు.

కేంద్ర౦ అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టడానికి ఏపీ ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేస్తే బావుణ్ణు; కేంద్రానికి సరైన రీతిలో బుద్ది చెప్పొచ్చని ఆ లేఖలో అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంతో తెలుగుదేశం విడిపోయిన నేపథ్యంలో చంద్రబాబు పిటీషన్ దాఖలు చేస్తే మన రాష్ట్రానికి గొప్ప మేలు జరగవచ్చని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.

కేంద్రం కూడా తన పిటీషన్ పై ఇంతవరకూ స్పందించలేదని అఫిడవిట్ కూడా దాఖలు చేయలేదంటూ చెప్పుకొచ్చారు. కాబట్టే ఈ అందువల్ల ఈ అవకాశాన్ని చంద్రబాబు నాయుడు ఉపయోగించుకోవాలని సూచించారు; కౌంటర్ దాఖలు చేయమని కోరారు. ఇప్పటికే జరిగిన ఆలస్యం వల్ల రాష్ట్రానికి చాలా నష్టం జరిగిందని ఇంకా ఇలానే ఉంటే మరింత అన్యాయం జరగవచ్చని ఉండవల్లి అన్నారు. చంద్రబాబు ఈ లేఖపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి!