Home రాజకీయాలు టిడిపి గ్రాఫ్ తగ్గుతోందట

టిడిపి గ్రాఫ్ తగ్గుతోందట

72
SHARE

తెలుగు మీడియాలో ఒక ఆసక్తికర కధనం వచ్చింది. టీడీపీ గ్రాఫ్‌ తగ్గి జగన్ బలపడుతున్నారని అంతర్గత చర్చలలో కొందరు తెలుగు తమ్ముళ్లు అంటున్నారట! ఇదే విషయాన్ని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు కూడా చెబుతుండటాన్ని చంద్రబాబు పరోక్షంగా ప్రస్తావించారు. అందుకనే చంద్రబాబు కొంతమంది ఎమ్మెల్యేలకు గట్టిగా క్లాస్‌ తీసుకున్నారు. టీడీపీలో అంతర్గతంగా జరుగుతున్న విషయాలను కొంతరు నేతలు ప్రత్యర్థులకు లీక్‌ చేస్తున్నారన్న విషయాన్ని అధినాయకత్వం గుర్తించింది. మొన్నటి వరకు చంద్రబాబు నిర్వహించే అంతర్గత టెలీకాన్ఫరెన్స్‌ ల్లో.. సమీక్షల్లో పాల్గొన్న ఈ నేతలకు ప్రస్తుతం నో ఎంట్రీ బోర్డు పెట్టారు టెలీ కాన్ఫరెన్స్‌లో కూడా కాల్ కలపవద్దని ఆదేశాలు జారీ చేశారు.

చంద్రబాబు దగ్గర జరిగిన అంతర్గత సమావేశం వివరాలు.. టెలీ కాన్ఫరెన్స్‌లో విషయాలను కొన్ని ఛానల్స్‌కు.. ప్రత్యర్ధి పక్షానికి చేరవేస్తున్నారని హైకమాండ్ కు కచ్చితమైన సమాచారం అందింది. ఫలితంగా వీరిని కట్ చేశారు. పార్టీలోనే తిరుగుతూ మరికొందరు ముఖ్యమంత్రి, మంత్రులు.. అధికారులపై చేస్తున్న విమర్శల వ్యవహారం కూడా చంద్రబాబు వరకు వెళ్లింది. సమాచారాన్ని లీక్ చేయడం, నోటి దురదను ఎక్కువగా ప్రదర్శిస్తున్న నేతలతో పార్టీకి చిక్కులు వస్తున్నాయని గ్రహించడంతో చంద్రబాబు వీరందరికీ చెక్ పెట్టాలని నిర్ణయించారట.

తెలుగుదేశంపార్టీకి విరోధులు ఎక్కడో లేరు.. పార్టీలోనే కొంతమంది నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీ పరువును బజారుకీడుస్తున్నాయి.. టీడీపీ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడి ప్రజలలో పలుచన అయ్యారు. ఎమ్మెల్యేల బంధువులు రాబందుల్లా నియోజకవర్గ ప్రజలను పీక్కుతిన్నారు. వీరిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అనేకసార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కోపగించుకున్నప్పుడు కొంతమేరకు తగ్గినట్టే తగ్గి ..ఆ తర్వాత మళ్లీ విజృంభించారు. ఇలాంటి నేతలు కొంతమంది దొంగే దొంగన్నట్టుగా అవినీతి పెరుగుతుందని చేస్తున్న వ్యాఖ్యలు చంద్రబాబు దృష్టికి వెళ్లాయి.