Home సినిమా ‘నేల టికెట్టు’ లో పవర్‌ స్టార్‌ ఎమోషనల్‌

‘నేల టికెట్టు’ లో పవర్‌ స్టార్‌ ఎమోషనల్‌

SHARE

ఎస్ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ”సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం” వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో, ‘రాజా ది గ్రేట్‌’తో అదరగొట్టిన మాస్ మహారాజా ‘రవితేజ’ హీరోగా రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న చిత్రం ‘నేల టిక్కెట్టు’. ఈ చిత్రం ఆడియో వేడుక గురువారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నెల 24న విడుదల కానున్న ఈ సినిమా ఆడియో రిలీజ్‌ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పవన్‌ కల్యాణ్‌ బిగ్‌ సీడీని రిలీజ్‌ చేశారు.

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ… ‘రవితేజ మాస్‌ మహారాజాగా మీకందరికీ తెలియకముందే నాకు బాగా తెలుసు. నా కంటే ముందే ఆయన నటుడయ్యారు. ఆయన నటనంటే నాకు చాలా ఇష్టం. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న వారే ఆయనలా నవ్వగలుగుతారు. నవ్వించగలుగుతారు. రవితేజలో నాకు నచ్చే విషయం. ఆయన ఎంత మందిలో ఉన్నా, ఏ పాత్రలో అయినా నటిస్తారు. సిగ్గు, బిడియం లేకుండా ఆయనలా నటించడం చాలా కష్టం’ అని అన్నారు. నిర్మాత రామ్‌ తాళ్లూరి గురించి పవన్‌ మాట్లాడుతూ..  సమాజానికి సేవ చేయాలనే గొప్ప మనసు కల్గిన వ్యక్తి. ఆయన ఖమ్మంలో ఎన్‌ఆర్‌ఐ స్వచ్ఛంద సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు తనకు పరిచయం’ అని అన్నారు. ‘నేల టికెట్టు’ ఘన విజయం సాధించాలని పవన్‌ ఆకాంక్షించారు.

‘‘పదేళ్ల క్రితం పవన్‌ కల్యాణ్‌గారితో ఫోన్‌లో మాట్లాడాను. ‘మీరు అంత సిగ్గు లేకుండా ఎలా చేస్తారండీ’ అని ఆయన అన్నారు. వన్నాఫ్‌ ది బెస్ట్‌ కాంప్లిమెంట్స్‌ అది. ఎప్పటికీ మర్చిపోలేను’’ అన్నారు రవితేజ. ‘‘హ్యాపీ బర్త్‌డే సత్యనారాయణ గారు (కల్యాణ్‌కృష్ణ తండ్రి). మీ కొడుకు హ్యాట్రిక్‌ సాధింబోతున్నాడు. శక్తికాంత్‌ మంచి సంగీతం ఇచ్చాడు. రామ్‌గారు ప్యాషనేట్‌ నిర్మాత’’  అని రవితేజ అన్నారు. ‘‘రవితేజగారు ఒప్పుకుంటే ఆయనతో మరో నాలుగు సినిమాలు చేద్దాం అనుకుంటున్నా’’ అన్నారు రామ్‌ తాళ్ళూరి.

షూటింగ్‌ స్టార్ట్‌ అవ్వడానికి ఫైవ్‌డేస్‌ ముందు రామ్‌గారిని కలిశాను. నాపై నమ్మకం ఉంచినందుకు నిర్మాతలకు థ్యాంక్స్‌’’ అన్నారు. ‘‘బడ్జెట్‌ పద్మనాభం’లో నేను హీరో, రవితేజ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌. ఇప్పుడు రవి హీరో.. నేను క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌. రవితేజ ఈ స్థాయికి వచ్చినందుకు శుభాకాంక్షలు’’ అన్నారు జగపతిబాబు. ‘‘ప్రేక్షకులు సాంగ్స్‌ను ఎంజాయ్‌ చేస్తారన్న గ్యారంటీ ఇవ్వగలను’’ అన్నారు శక్తికాంత్‌. ‘‘రవితేజగారి ‘దుబాయ్‌ శీను’ సినిమాకు 5 పాటలు రాశాను. ఈ సినిమాకి ఒక సాంగ్‌ రాశాను’’ అన్నారు రామజోగయ్య శాస్త్రి.

జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాశ్, రఘుబాబు, సుబ్బరాజు, ఆలి, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, ప్రియదర్శి, సురేఖా వాణి, ప్రవీణ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ‘ఫిదా’ ఫేం శక్తికాంత్ కార్తీక్ సంగీతం, ఛోటా కే ప్రసాద్ కూర్పు, బ్రహ్మ కడలి కళ, ముఖేష్ ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారు.