Home రాజకీయాలు బీపీ బాబు నోట పీకుడు మాట!

బీపీ బాబు నోట పీకుడు మాట!

SHARE

రాష్ట్రంలో కాదు.. దేశంలోనే అత్యంత సీనియర్ నాయకుడిని అని ప్రకటించుకుంటుంటారు చంద్రబాబు. తనకు తానే సాటని, తనకు లేరెవరూ పోటీ అనేది బాబు సెల్ఫ్ కబుర్లలో ఒకటి. ఎన్నో కష్టాలు ఒడిదుడుకు తాను ఎదుర్కొన్నానని, అయినా కూడా ఎప్పుడూ కంట్రోల్ తప్పి మాట్లాడలేదని చెప్పుకొస్తుంటారు. కాసేపు అవే నిజం అనుకుంటే… సీనియర్ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు బాబులో ఉన్నాయా. ఒకప్పుడు ఉన్నా ప్రస్తుతం కనుమరుగవుతున్నాయి. అంటే.. అవుననే సమాధానాలే వస్తున్నాయి.

రోజు రోజుకీ పెరిగిపోతున్న ప్రభుత్వ వ్యతిరేకతే కారణమో.. లేక చినబాబు చేస్తున్న పనులు తెచ్చిపెడుతున్న కష్టాలే కారణమో.. అదీగాక ప్రస్తుతం పాదయాత్రలో ఉన్న జగన్ కు రోజు రోజుకీ పెరిగిపోతున్న జనాధరణ తెచ్చిన టెన్షనే కారణమో తెలియదు కాని.. బాబుకు ఉన్నపలంగా బీపీ పెరిగిపోతుంది. ప్రజలు చూస్తున్నారు.. మీడియా లైవ్ కవరేజ్ చేస్తుంది.. తాను ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తి అనే విషయాలు మరిచారు చంద్రబాబు… “పీకుడు” మాటలు మాట్లాడారు.

కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఓర్వకల్‌ వద్ద జయరాజ్‌ ఇస్పాత్‌ స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన పారిశ్రామివేత్తల మీడియా సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నలపై బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. టిడిపి ప్రభుత్వం శంకుస్థాపనలకే పరిమితమయ్యిందంటూ ప్రతిపక్షాలు అరోపిస్తున్నాయని ఓ మీడియా ప్రతినిధి అడగగా… ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయిన చంద్రబాబు…”వారు అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకారు” అని స్పందించారు. దీంతో ఖంగుతిన్న మీడియా ప్రతినిధులు బాబు వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాక గందరగోళంలో పడిపోయినంత పనిచేశారు.

దీంతో ఆఫ్ ద రికార్డ్ జర్నలిస్ట్ ల డిస్కషన్స్ లో… ఇవి అసహనం తాలూకు లక్షణాలని, అనంతరం మరింత బీపీ పెరిగిపోతుందని.. ఏమీ పీకలేనప్పుడే ఇలాంటి మాటలు వస్తాయని.. ఇప్పటివరకూ అధికారంలోకి రాని ప్రతిపక్ష వైసీపీ, గతంలో ఏమి పీకిందనే స్థాయిలో బాబు మాట్లాడటం వారి మానసిక పరిస్థితిపై అనుమానాలు రేపుతుందని.. ఇది పూర్తిగా అభద్రతాభావం తాలూకు మిడిల్ స్టేజ్ లక్షణాలని మాట్లాడుకోవడం కొసమెరుపు!