Home రాజకీయాలు అమిత్ షా పై దాడి వివాదం.. బాబు స్పందన

అమిత్ షా పై దాడి వివాదం.. బాబు స్పందన

80
SHARE

తిరుమల నుంచి తిరిగి వెళుతున్న బిజెపి అద్యక్షుడు అమిత్ షా కాన్వాయి పై టిడిపి కార్యకర్తలు కొందరు రాళ్లతో దాడి చేయడం.. టిడిపి, బిజెపిల మద్య మరింత వివాదంగా మారింది. పదకం ప్రకారమే అమిత్ షా పై దాడి జరిగిందని తెలంగాణ బిజెపి అద్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. ఎపిలో బిజెపి అద్యక్షుడికే రక్షణ లేకపోతే సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏమిటని మాజీ మంత్రి మాణిక్యాల రావు అన్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే షా పై దాడి జరిగిందని దీనికి చంద్రబాబు బాద్యత వహించాలని, ఆయన కనుసన్నలలోనే ఇది జరిగిందని లక్ష్మణ్ ఆరోపించారు.

బీజేపీ దేశ వ్యాప్త విజయాలను జీర్ణించుకోలేక ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ గెలుపు ఆంధ్రప్రదేశ్‌లో కూడా పాకుతుందనే భయంతో ఇలాంటివి చేస్తున్నారని లక్ష్మణ్‌ పేర్కొన్నారు. ఏపీ ప్రజలు మీ పాలనపై, మీపై రాజకీయంగా చరమ గీతం పాడతారని వ్యాఖ్యలు చేశారు.

బిజెపి శాసనసభ పక్ష నేత కిషన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుకు తెలిసే ఈ దాడి జరిగిందని, ఇందుకు బాబు బహిరంగంగా అమిత్ షాకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఎన్నడూ తిరుపతిలో ఇలా జరగలేదని ఆయన అన్నారు.

బిజెపి అద్యక్షుడు అమిత్ షా పై దాడి ఘటన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇబ్బందిగా మారింది. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కదనం వచ్చింది. ఏ టైమ్ లో ఏమి చేయాలో తెలియకుండా వ్యవహరిస్తారా అని టిడిపి కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారట.

పార్టీ క్రమశిక్షణకు బద్ధులై అందరూ వ్యవహరించాలని.. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలిసీ తెలియని ప్రవర్తనతో పార్టీకి చెడ్డపేరు తీసుకురావొద్దని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని పార్టీ శ్రేణులను ఆదేశించారు.