Home రాజకీయాలు ప్లెడ్జి చేయటం వరకేనా ఆచరణలో కూడానా పవన్?

ప్లెడ్జి చేయటం వరకేనా ఆచరణలో కూడానా పవన్?

SHARE

జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో రికార్డు సైజులో వున్నా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పతాక ఆవిష్కరణ అనంతరం, జనసేన అధినేత కార్యకర్తలు, అభిమానులతో సమైక్యతా ప్రతిజ్ఞ ఒకటి చేయించారు. ఆదిలా వుంది:

భారతీయుడైన నేను, భారతదేశ పౌరుడిగా పుట్టినందుకు గర్వపడుతున్నాను. నా దేశ వారసత్వ సంపదను పరిరక్షిస్తూ, ప్రకృతికి నష్టం కలిగించకుండా, పర్యావరణాన్ని కాపాడుతూ, అనునిత్యం దేశ ప్రజల శ్రేయస్సుకై పరితపిస్తూ, దేశప్రజలందరి ఎడలా సహోదర భావం కలిగివుంటూ, ఎటువంటి కుల, మత, ప్రాంత, వర్గ విభేదాలకు తావులేకుండా, దేశ ప్రయోజనాలే పరమావధిగా పాటిస్తూ, మన ఆడపడచుల పైన, మన అక్క చెల్లెళ్లపైనా, మన మహిళలపైనా పేగుబంధం కలిగి, వారిని సంరక్షించే బాధ్యత కలిగిన వాడిగా నడుచుకుంటానని, దేశ చట్టాలను గౌరవిస్తూ, దేశాభివృద్ధి కొరకు శక్తివంచన లేకుండా పనిచేస్తానని, దేశ సాక్షిగా, జెండా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.

జన సేన అధినేత ప్రతిన బానే వుంది…చేతల్లో ఎంత పస ఉంటుందో వేచి చూడాలి. ముఖ్యం గా కొంత మంది జన సేన ఫాన్స్ సోషల్ మీడియా లో ఆడవారిపై చేసే కామెంట్లకీ ఈ ప్రతిజ్ఞ కీ ఏ మాత్రం సంభంధం లేదు. రాయటానికి వీలు కానీ భాషతో చీప్ కామెంట్లతో పోస్టులు పెట్టకుండా ఉంటే ఆడవారిని సంరక్షించినంత అంటూ కొంత మంది సెటైర్లు వేస్తున్నారు!