Home రాజకీయాలు అనంత వద్దు.. అవనిగడ్డ ముద్దు.. కారణం ఇదేనా?

అనంత వద్దు.. అవనిగడ్డ ముద్దు.. కారణం ఇదేనా?

SHARE

ఎన్నికల్లో పార్టీ అధినేతలు పోటీచేసే స్థానాలకు చాలా క్రేజ్ ఉంటుంది. రాష్ట్రం మొత్తం నియోజకవర్గాల చూపు ఆ ఒక్క స్థానంపై ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటుంది అనడంలో సందేహం లేదు! ఈ క్రమంలో కడప పులివెందుల నుంచి వైఎస్సార్ ఫ్యామిలీ, కుప్పం నుంచి చంద్రబాబు, నందమూరి వారి ఫ్యామిలీ హిందూపురం వంటి స్థానాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో పూర్తిస్థాయిలో రంగంలోకి దిగబోతున్న కొత్త పార్టీ జనసేన అధినేత పవన్ కల్యాన్.. ఎక్కడి నుంచి పోటీచేస్తున్నారనే విషయంపై ప్రస్తుతం విశ్లేషణలు మొదలయ్యాయి.

గతంలో.. అనంతపురం నుంచి పోటీచేస్తానని పవన్ ప్రకటించగానే, ఇక ఆ విషయంపై ఎవరూ స్పందించలేదు! పవన్ స్థానం ఫిక్స్ అని అంతా ఫిక్సయిపోయారు. అనంతర కాలంలో తిరుపతి నుంచి పవన్ పోటీచేయొచ్చు అనే మాటలు వినిపించినా వాటిని అంతా లైట్ తీసుకున్నారు. ఇక అనంతపురానికే పవన్ ఫిక్స్ అని అంతా ఫిక్సయిపోయారు. ఇంతలో ఏమిజరిగిందో తెలియదు కానీ.. పవన్ కల్యాన్ అవనిగడ్డ నుంచి పోటీచేస్తారని లీకులిస్తున్నారు జనసేన జనాలు! ఇది చిన్నా చితకా స్టేట్ మెంట్ కాదు కాబట్టి కచ్చితంగా పవన్ అనుమతి మేరకే బయటకు వచ్చి ఉంటుంది. దీంతో అసలు అవనిగడ్డనే ఎందుకు ఎంచుకున్నారు అనే కోణంలో విశ్లేషణలు మొదలైపోయాయి.

అవనిగడ్డలో ప్రస్తుతం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మండలి బుద్ధ ప్రసాద్ గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గెలిచాడు. 2009ఎన్నికల్లో ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ కు దెబ్బేసింది. నాటి త్రిముఖ పోటీలో గతంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మండలి ఓడిపోయిన సమయంలో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి సింహాద్రి రమేష్ 37వేల ఓట్లను సాధించి మూడో స్థానంలో నిలిచాడు. త్రిముఖ పోటీలో 37వేల ఓట్లు అనేది పెద్ద నెంబరే అనేది విశ్లేషకుల మాట. ఓట్ల శాతానికొస్తే… 2009లో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే కి 34.46% ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్ధి బుద్ద ప్రసాద్ కి 34.20% ఓట్లు రాగా.. ప్రజారాజ్యం అభ్యర్ధికి 23.46% ఓట్లు వచ్చాయి!

ఈ లెక్కలన్నీ బేరీజు వేస్తున్న జనసేన జనాలు.. వీలైనంత సేఫ్ జోన్ ని పవన్ కు కేటాయించే క్రమంలో సుమారు 196000 ఓట్లు ఉన్న ఈ ప్రాంతంలో కాపు సామాజిక వర్గ ఓట్లు 57,000 గా ఉన్నాయి. ఇది కూడా పవన్ అవనిగడ్డను ఎంచుకోవడానికి కారణం అయ్యి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కొత్త ఇల్లు, కొత్త ఆఫీసులకు కూడా ఈ నియోజకవర్గం అందుబాటులో ఉంటుందనేది మరో కామెంట్!!