Home సినిమా బాక్స్ ఆఫీస్ కొల్లగొడుతున్న మహానటి!

బాక్స్ ఆఫీస్ కొల్లగొడుతున్న మహానటి!

112
SHARE

స్టార్ హీరోలు లేని సినిమా; అలనాటి స్టార్ హీరోయిన్ బయోపిక్ సినిమా. అయితేనేం… మహానటి సావిత్రి గారి చరిష్మా ఎంత కాలమైనా ఇలానే వుంటుంది అనడానికి నిదర్శన; మహానటి సినిమా వసూళ్లు.

సావిత్రి కథ సినిమా గా తీస్తే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించవచ్చని బహుశా నాగ్ అశ్విన్ మాత్రమే ఊహించి వుంటారు. కథ లో దమ్ము అంతే చాలు కాస్ట్ కానీ క్రూ తో గాని సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులుపుతూ దూసుకుపోతోంది మహానటి.

ప్రేక్షకులు అలనాటి అగ్ర తార సావిత్రి జీవిత కథ తో తెరకెక్కించిన ఈ చిత్రానికి బ్రహ్మ రధం పడుతున్నారు. విడుదలకు ముందే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా విడుదల తర్వాత కూడా అదే దూకుడు ప్రదర్శిస్తూ ఉండటం తో ఈ చిత్రాన్ని చూడాలని ప్రేక్షకులు థియేటర్ ల వద్ద క్యూలు కడుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అమెరికా లో కూడా మహానటి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రహ్మాండమైన వసూళ్లు రాబడుతుంది. కేవలం ప్రీమియర్లతోనే సినిమా దాదాపు మూడు లక్షల డాలర్ల వసూల్ చేసిందని టాక్.

సాధారణం గా స్టార్ హీరో ల సినిమాల ప్రీమియర్స్ కి ఈ స్థాయిలో వసూళ్లు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే మహానటి కలెక్షన్స్ చూసి స్టార్ హీరోలు సైతం షాక్ కి గురౌతున్నారు. ఇక ఈ దూకుడు ఇలానే ఉంటే వీకెండ్ కి వన్ మిలియన్ సాధించడం చాలా వీజీ అంటున్నారు.