Home రాజకీయాలు గుంటూరులో పాస్‌పోర్టు కార్యాలయం

గుంటూరులో పాస్‌పోర్టు కార్యాలయం

83
SHARE

గురువారం గుంటూరులో రీజినల్ పాస్‌పోర్టు సేవా కేంద్రం ప్రారంభమైంది. చంద్రమౌళి నగర్‌లోని పోస్టాపీసులో ప్రాంతీయ పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని సభాపతి కోడెల శివప్రసాదరావు గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్సీ రామకృష్ణ, కలెక్టర్ కోన శశిధర్ తదితరులు పాల్గొన్నారు.

కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌పై తెలుగుదేశం పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్‌ ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ జయదేవ్ ప్రసంగిస్తూ… గుంటూరులో పాస్‌పోర్టు కేంద్రం ఏర్పాటు చేయాలని నేను లేఖ రాయగానే సుష్మాస్వరాజ్‌ స్పందించారన్నారు. సుష్మ స్వరాజ్ శ్రద్ధ చూపడం వల్లే పాస్‌పోర్ట్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయగలిగామన్నారు.