Home రాజకీయాలు లడ్డు కావాలా పవన్? రెండో లడ్డూ? మూడో లడ్డూ కూడా నా?

లడ్డు కావాలా పవన్? రెండో లడ్డూ? మూడో లడ్డూ కూడా నా?

SHARE

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ 175 అనటమే కాకుండా ఆ దిశగా పనులు కూడా షురూ చేశారు. నియోజకవర్గాల్లో తమ బలమెంతుందో తెలియక ముందే ఏపీలో అన్ని సెగ్మెంట్స్‌లో సత్తా చాటుదాం అని పార్టీ క్యాడర్లకి పిలుపిచ్చారు జనసేనాని పవన్.

ఇక రాష్ట్రంలోని పార్టీలు జనసేన బలం పై మల్లగుల్లాలు పడుతున్నాయి. మీడియా కూడా 175 నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ కి వుండే క్యాడర్ ఏమిటి అని ఆసక్తి ఒలకబోస్తోంది. ఇక ఈ క్రమంలోనే పవన్ మరో సంచలన ప్రకటన చేయబోతున్నట్టు సమాచార౦.

అదే పవన్ పోటీ చేసే స్థానాలు. కరువు జిల్లా అనంతపురం నుంచి పోటీ చేస్తానని అప్పుడెప్పుడోనే చెప్పాడు కాబట్టి అనంతపురం పవన్ నియోజకవర్గం అని చెప్పొచ్చు. కానీ జనసేనాని అనంతపురం కాక మరో రెండు నియోజకవర్గాల మీద కన్నేసాడట.

కృష్ణా జిల్లా అవనిగడ్డ ఇంకా తిరుపతి ని ఫైనలైజ్ చేసాడని చెబుతున్నారు. ఆవనిగడ్డ లో గత దశాబ్ద కాలంగా తెలుగుదేశం ప్రభంజనమే వుంది. ఆ సైకిల్ పడగొట్టే దమ్ము జనసేన కి ఉందా? పవన్ కి మూడు అచ్చొచ్చిన సంఖ్యా? చూద్దాం!!