Home సినిమా నా పేరు సూర్య ను నిలబెట్టేందుకు వస్తున్న పవన్

నా పేరు సూర్య ను నిలబెట్టేందుకు వస్తున్న పవన్

SHARE

డివైడ్ టాక్ వున్న నా పేరు సూర్య ను నిలబెట్టేందుకు ఈ చిత్రం యూనిట్ కష్ట పడుతుంది. నా పేరు సూర్య ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు మొన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వచ్చారు.. ఇప్పడు నా పేరు సూర్య అన్న బన్నీ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్నారు.

నా పేరు సూర్య కలెక్షన్లను స్టడీగా వుంచేందుకు, ప్రచారానికి బలం తెచ్చేందుకు ఈ చిత్రం యూనిట్ థాంక్స్ టు ఇండియా పేరున ఓ సక్సెస్  మీట్ ప్లాన్ చేసారు. ఈనెల 10న ఆ సక్సెస్ మీట్ వుంటుంది.

ఈ సక్సెస్ మీట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ఈవిషయాన్ని యూనిట్ ట్విట్టర్ ద్వారా తెలియ పరిచారు.