Home రాజకీయాలు కోడెల కోడలు పేరుచెప్పి వేసుకున్న జగన్!

కోడెల కోడలు పేరుచెప్పి వేసుకున్న జగన్!

SHARE

దేశం మొత్తం సంగతి కాసేపు పక్కనపెట్టి… రాష్ట్రం మట్టుకు గమనిస్తే.. ఏపీలో మహిళలకు ఉన్న రక్షణపై రకరకాలా వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రోజు రోజుకీ బాబు పాలన – మహిళలకు ఉన్న భద్రత విషయంపై సర్వత్రా చర్చలు నడుస్తున్న క్రమంలో.. ఉన్నపలంగా మహిళలపై ప్రేమ కురిపించే పనికి పూనుకున్నారు చంద్రబాబు! “నిశబ్ధాన్ని చేధించాలి – బాలికలను రక్షించాలి”.. “బాలికల రక్షణ మనందరి బాధ్యత” అంటూ హడావిడి చేస్తున్నారు.

ఎమ్మార్వో వనజాక్షి సంఘటన నుంచి మొదలుపెడితే… కాల్ మనీ వ్యవహారం.. ప్రతీ రోజూ పత్రికల్లోని జిల్లా ఎడిషన్స్ లో వస్తున్న ఎన్నో మహిళలపై దాడులు, అత్యాచారాలకు సంబందించిన అంశాలపై మౌనంగా బాబు.. ఇప్పుడు సడన్ గా మహిళల రక్షణపై స్పందించేస్తున్నారు. ఇది ఎన్నికల డ్రామాలని తెలుసుకున్నారో ఏమో కానీ.. జగన్ బాబు నిబద్దత గుట్టు విప్పారు!

కృష్ణాజిల్లాలో సాగుతున్న జగన్ పాదయాత్ర.. టీడీపీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా తరుణంలో… టీడీపీ నేతల కుటుంబాలపట్ల కూడా బాబుకు సరైన చిత్త శుద్ది లేదని, అసలు ఆడబిడ్డలంటేనే బాబుకు నచ్చదని జగన్ తనదైన శైలిలో ఫైరయ్యారు. ఆడపిల్లలపైనా, వారి రక్షణపైనా బాబుకు ఉన్న చిత్త శుద్ధికి స్పీకర్ కోడెల శివప్రసాద్ కోడలు వ్యవహారాన్ని మరోసారి గుర్తుచేశారు. కోడెల ఇంటి కోడలు తనను చిత్రహింసలు పెడుతున్నారంటూ బయటకొచ్చి కంప్లయింట్ ఇచ్చినా కూడా ఆ స్పీకర్ ను కొనసాగిస్తున్న తీరే చెబుతుంది.. బాబుకు మహిళలలపై ఉన్న ప్రేమ గురించి!!

ఇదే క్రమంలో తాజా సర్వే విషయాలను కూడా జగన్ ప్రస్థావించారు. దేశవ్యాప్తంగా సగటున ఐదుగురు మంత్రులు, మహిళలపై నేరాలు చేశారని.. ఆ 5 మందిలో ఇద్దరు మంత్రులు చంద్రబాబు కేబినెట్ లోనే ఉన్నారని జగన్ గుర్తుచేసే ప్రయత్నం చేశారు!! ఈ సర్వే వ్యవహారం వెలుగులోకి రాగానే ఆ ఇద్దరు మంత్రులపై చంద్రబాబు చర్యలు తీసుకుని ఉన్నా, మంత్రి పదవులనుంచి భర్తరఫ్ చేసినా కాస్తూ కూస్తో హర్షించేవారే.. కానీ ఆ విషయంలో మిన్నకున్నారు బాబు!!

ఇదే క్రమంలో చింతమనేని వ్యవహారంలో కూడా బాబు స్పందించిన తీరు.. మహిళలకు పూర్తి వ్యతిరేకి అనే విషయాన్ని స్పష్టం చేసింది!! కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ వ్యవహారమే కానీ.. బాబు అధికారంలోకి వచ్చినప్పటినుంచి పసుపు కండువాలు కప్పుకున్న జనం.. మహిళలపై చేస్తున్న అకృత్యాలపై బాబు ఎప్పటికప్పుడు స్పందించి చర్యలు తీసుకునేలా చేసి ఉంటే.. నేడు బాబు చేస్తున్న కొవ్వొత్తుల ర్యాలీల వ్యవహారాలను నమ్మొచ్చేమో కానీ… ఇంతకాలం మహిళలలపై జరుగుతున్న దాడుల విషయంలో మెతకవైఖరి అవలంబించిన బాబు.. తాజా దొంగప్రేమను ఎవరూ నమ్మే పరిస్థితిలోలేరనేది జగన్ చెబుతున్న మాట!! వాస్తవ పరిస్థితులు కూడా అందుకు భిన్నంగా లేవనేది విశ్లేషకుల మాట!!