Home రాజకీయాలు కమ్యునిస్టులు.. లక్ష్యం మారిపోయిందా?

కమ్యునిస్టులు.. లక్ష్యం మారిపోయిందా?

71
SHARE

ఏమాటకామాట చెప్పుకోవాలంటే… ఏపీలోని కమ్యునిస్టులు ఏమిటో.. వారి అభిప్రాయాలు ఏమిటో.. వారి ప్లాన్స్ ఏమిటో.. అసలు వారి లక్ష్యం ఏమిటో ఎవరికీ అంతుపట్టని వ్యవహారంగా తయారయ్యింది అనడంలో ఎవరికీ సందేహం ఉండకపోవచ్చు. ఒకప్పుడు కమ్యునిస్టులు అంటే… వారి వ్యవహార శైలిపైనా, వారి పద్దతులపైనా, వారి విధివిదానాలపైనా సర్వత్రా సహేతుకమైన అభిప్రాయం ఉండేది. కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు!

ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కమ్యునిస్టులు ఆటలో అరటిపండుల్లా మారిపోతున్నారనే చెప్పుకోవాలి. నిన్న మొన్నటివరకూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో రాసుకు పూసుకు తిరిగారు కమ్యునిస్టులు. తనకు కమ్యునిజం చాలా ఇష్టమని, కమ్యునిజం పుస్తకాలు తెగ చదివానని పవన్ చెప్పగానే.. పక్కన కూర్చుని మీటింగులు పెట్టారు కమ్యునిస్టు సోదరులు! ఇంతలోనే ఏమైందో ఏమో తెలియదు కానీ.. మొత్తం అన్ని స్థానాల్లోనూ జనసేన పోటీ చేస్తుందని ప్రకటించేశారు పవన్! దీంతో కమ్యునిస్టులు మరో గొడుకు కిందకు చేరాల్సిన పరిస్థితి!

ఈ క్రమంలో నిన్నమొన్నటివరకూ టీడీపీకి, వైకాపా కు వ్యతిరేక శక్తులను ఏకం చేయాలని ప్రకటనలు గుప్పించిన కమ్యునిస్టు జనాలు.. ఉన్నట్లుండి యూ టర్న్ తీసుకున్నారు! యూటర్న్ తీసుకోవడంలో పి.హెచ్.డి చేసిన బాబువైపు మొగ్గుచూపుతున్నారు! దీనికి కారణం… జగన్ కాబోయే ముఖ్యమంత్రి అనే మాట వింటేనే ఎగిరిపడిపోతున్నారు. ప్రస్తుతం కమ్యునిస్టుల మాటలు, వారి కామెంట్లను సరిగ్గా గమనిస్తే… ఈ విషయం ఇట్టే అర్ధం అవుతుంది.

అయితే.. దీనికి కారణం కమ్యునిస్టులకు స్థిరత్వం లేకపోవడం అనే మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం చంద్రబాబే అని ప్రకటించిన కమ్యునిస్టులు… రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని ప్రెస్ మీట్ లు పెట్టిన కమ్యునిస్టులు.. మహిళలకు రక్షణ కరువైందని బాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేసిన కమ్యునిస్టులు.. తాజాగా చంద్రబాబే సరైన వ్యక్తి అని చెప్పదలచుకున్నారా? చంద్రబాబు పాలనలో రాష్ట్రం సుబిక్షంగా ఉందని ప్రకటించబోతున్నారా? గత నాలుగేళ్ల పాలన చూసిన అనంతరం కూడా.. తమ మద్దతు చంద్రబాబుకే అని కమ్యునిస్టులు ప్రకటిస్తే మాత్రం… పైన పేర్కొన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పితీరాల్సిందే!!