Home రాజకీయాలు బాలయ్యను ఇబ్బందిపెడుతున్న అల్లుడి కోరిక!

బాలయ్యను ఇబ్బందిపెడుతున్న అల్లుడి కోరిక!

SHARE

టెస్టు క్రికెట్ లో కొన్ని సందర్భాల్లో గెలవడం సాధ్యం కానప్పుడు కనీసం అడ్డంగా వికెట్లకు అడ్డుపడైనా సరే “డ్రా” దిశగా ఆట సాగిస్తుంటారు క్రీడాకారులు.. ఇది సేఫ్ గెం అని అభివర్ణిస్తుంటారు! ఇందుకు రాజకీయాలేమీ మినహాయింపు కాదనే చెప్పాలి. భారీగా గెలవలేకపోయినా పర్లేదు కానీ.. ఘోరంగా ఓడిపోకూడదు అన్న సూత్రంతో మరికొందరు ముందుకెళ్తుంటారు! ఈ క్రమంలో టీడీపీకి కంచుకోట అని చెప్పుకునే నియోజకవర్గాల్లో హిందూపురం ఒకటి! ప్రస్తుతం ఈ నియోజకవర్గం బాలయ్యకు – లోకేష్ కు మధ్య గ్యాప్ తీసుకొస్తుందని అంటున్నారు!!

గత సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గం నుంచి బాలకృష్ణ పోటీచేసి గెలుపొందిన సంగతి తెలిసిందే! ఇక్కడ టీడీపీ నుంచి బాలకృష్ణే కాదు.. ఎవరు పోటీచేసినా గెలుపొంది తీరతారనేది చరిత్ర చెబుతున్న విషయం! ఇదే కారణమో లేక మామగారి సేఫ్ జోన్ ని కబ్జా చేయాలనే తాపత్రయమో కానీ.. లోకేష్ బాబు కూడా రాబోయే ఎన్నికల్లో హిందూపురం నుంచే పోటీచేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతం ఈ ఆలోచన.. బాలయ్యకు కంటిమీద కునుకులేకుండా చేస్తుందని అంటున్నారు!

ఒక వేల హిందూపురం లోకేష్ కి ఇచ్చేస్తే… గుంటూరు, విజయవాడల్లోని మరేదైనా సేఫ్ జోన్ ని తనకు కేటాయించాలని అడుగుతున్నారట బాలయ్య! అయితే.. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లోనూ సిట్టింగులు, ఆశావహులు పుష్కలంగా ఉండటంతో.. ఎవరూ త్యాగాలకు సిద్దపడటం లేదని సమాచారం! దీంతో బాలయ్య అలకపానుపు ఎక్కుతారా లేక అల్లుడికోసం సర్ధుకుని రాజీపడతారా అనేది వేచి చూడాలి.

ఇక్కడ మరో విషయం ఏమిటంటే… ఇప్పటికే షార్ట్ కట్ లో మంత్రి అయిపోయిన లోకేష్, రాబోయే ఎన్నికల్లో కూడా ఇలాంటి మార్గం ద్వారానే గట్టెక్కాలని చూస్తున్నారట. అది జరగాలంటే.. రాబోయే ఎన్నికల్లో కూడా టీడీపీ అధికారంలోకి వచ్చి తీరాలి. అది జరిగేపని కాకపోవచ్చనే ఆలోచనతో.. మాగ్జిమం సేఫ్ గేం ఆడే క్రమంలో.. హిందూపురం పై లోకేష్ ఆశపడుతున్నారని సమాచారం! అదేదో కుప్పం నుంచో, నగరి నుంచో పోటీ చేయొచ్చు కదా.. మా బాలయ్య స్థానమే కావాలా అని ఫ్యాన్స్ తెగ ఫీలయిపోతున్నారట!!