Home రాజకీయాలు ఓటుకు నోటు కేసులో బాబును A-1 ముద్దాయి చేయబోతున్నారా?

ఓటుకు నోటు కేసులో బాబును A-1 ముద్దాయి చేయబోతున్నారా?

85
SHARE

రాష్ట్ర విభజన నేపథ్యంలో పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గా వుంది. అయితే ఆంధ్ర కు పరిపాలన తరలించడం వెనుక చంద్రబాబుది పెద్ద మతలబే వుంది. ఎవరు ఒప్పుకున్నా లేకున్నా ఓటుకు నోటు కేసే కారణ౦ అని అంతా అంటారు. మేము హైదరాబాద్ ను పదేళ్లు విడిచి వెళ్లే ప్రసక్తే లేదంటూ చెప్పిన ఏపీ ముఖ్యమంత్రి ఉన్న పళఆన హైదరాబాద్ నుంచి అమరావతికి షిప్ట్ అయిపోయారు, అంతేనా తనతో పాటుగా అధికారులు సెక్రటేరియట్ స్టాఫ్ కూడా కదలాలని హుకుం జారీ చేశారు. సౌకర్యాల మాట అటుంచి కనీస వసతులు లేవని మొత్తుకున్నా బాబు ససేమిరా అనటానికి ఓటుకునోటు భయమే కారణమంటూ టాక్ ఉంది.

ఇక నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి పోలీసు మరియు న్యా సలహాదారులతో జరిపైన చర్చలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఓటుకు నోటు కేసులో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మొదటి నిందితుడుగా చార్జీషీట్ పెట్టవచ్చని కదనాలు వెలువడుతున్నాయి.

2015 శాసన మండలి ఎన్నికల్లో నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెట్టే ప్రయత్నం చేసినట్లు వెలువడిన ఆడియో టేపుల లో స్వరం చంద్రబాబుదే అని ఫోరెన్సిక్ నిపుణులు చెప్పిన మీదట ఈ కుట్రలో ఆయన పాత్ర కీలకం అవుతుందని న్యాయ నిపుణులు ఇప్పటికే అబిప్రాయపడ్డారు. కావున కేసులో ఆయనని ఏ–1 నిందితుడిగా పేర్కొ నే అవకాశం వుంది. చట్టం ముందు అందరూ సమానులే. చట్ట ప్రకారం వ్యవహరించండి. మీపై ఎలాంటి ఒత్తిళ్లు ఉండవు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటూ ముఖ్యమంత్రి కెసిఎఆర్ ఈ సందర్భంగా అధికారులతో వ్యాఖ్యానించారు.

ప్రత్యేక హోదా, ఎన్డీఏ తో తెగతెంపులు లాంటి అంశాలతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఇదో ఊహించని షాకె ….

రాజకీయవర్గాలు కూడా బాబు బుక్ అవడం ఖాయ౦ అంటూ చర్చించుకుంటున్నాయి!