Home రాజకీయాలు కర్ణాటక లో మోదీ దిగజారుడు ప్రచారం??

కర్ణాటక లో మోదీ దిగజారుడు ప్రచారం??

SHARE

అదేంటో గాని ఎన్నికల టైం కి పాకిస్థాన్‌ను బ్రహ్మా౦డంగా వాడుకోవడం ఒక్క భాజపా మాత్రమే తెలిసిన విద్య! కాంగ్రెస్‌ కేవలం ముస్లింలను మాత్రమే గౌరవి౦చే పార్టీ అని, హిందువులను రెచ్చగొట్టడం, కాంగ్రెస్ దళితులను అవమానించింద౦టూ రెచ్చగొట్టటం .. ఏళ్ళ క్రితం జరిగిన సంఘటనలు చెప్పుకోటం, సభ జరిగిన ప్రతీ వూళ్ళో జనాలపై కాంగ్రెస్ మిమ్మిల్ని ఇంత అవమానించింది అంత అవమానించింది అంటూ జనాలపై ఉత్తుత్తి జాలి కురిపించటం. ఇదే కర్ణాటక ఎన్నికల బహింరంగా సభలలో ప్రధానమంత్రి ప్రచార విధానమూ, సరళీ! ఒక్కటంటే ఒక సభలోనూ తమ ప్రభుత్వ విజయాలు చెప్పుకునే ప్రయత్నం కూడా చేయకపోవటం గమనార్హం. కుల మత వర్గ విద్వేషాలను రెచ్చగొట్టడ౦ అన్న ఒకే ఎజెండా తో ప్రచారం చేస్తున్నారు. ఇది ఆయన స్థాయి కి తగినట్టు ఏ మాత్రం లేదని సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ప్రచారంలో భావోద్వేగానికి గురి అవ్వటం… రెచ్చగొట్టటం నాటకీయత ఇంత అవసరమా ఒక అసెంబ్లీ ఎలక్షన్స్ కి మునుపెన్నడూ లేని రేంజ్ లో ప్రచార౦ అవసరమా అంటూ రాజకీయ నిపుణులు నవ్విపోతున్నారు. ఎప్పుడూ తనంటే ఒక సానుభూతి, జాలి కలగాలి అన్నట్లుగా సాగే ప్రచారాలు, తానొక పేద తల్లికి బిడ్డనని, బలహీనవర్గానికి చెందిన వాడినీ అంటూ చెప్పుకోవటమే తప్ప తాను చేసిన మంచి పనులు మచ్చుకి కొన్ని కూడా చెప్పుకోలేని ప్రచారం ఎంత దౌర్భాగ్యం?

ఆరిపోతున్న బీజేపీ దీపాన్ని ఈ బావోద్వేగాలు ఎంత వరకూ ఆపగలవో మరో వారంలో తేలనుంది!!

కర్ణాటక ఎన్నికల ఫలితాల ఆధారంగా దేశ రాజకీయాల్లో పెనుమార్పులు జరగవచ్చు అందుకే ప్రధాని మోదీ అంతగా తాపత్రయ పడుతూ విద్వేష రాజకీయం ప్రచారాలు. కర్నాటకం ఎటు తీర్పు ఇస్తుందో చూద్దాం!!