Home రాజకీయాలు ప్రజలు చెవుల్లో పూలు పెడుతున్నారు

ప్రజలు చెవుల్లో పూలు పెడుతున్నారు

70
SHARE

బహుభాషా నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఆదివారం హుబ్లీ నగరంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ బీజేపీ నాయకుల అబద్ధాలు తమను కష్టాల్లో నెట్టాలా చేస్తున్నాయని.. తానేమైనా ప్రశ్నలను వేస్తే హిందూమత వ్యతిరేకి అనటం ఎందుకని ఆయన ప్రశ్నించారు. తాను ఆరంభించిన ‘జస్ట్‌ ఆస్కింగ్‌’ ఒక రాజకీయ పార్టీ కాదని అదొక ఆందోళన అని స్పష్టం చేశారు. అందరినీ ప్రశ్నించే బాధ్యత తమకు ఉందని అన్నారు.

ప్రధానమంత్రే ప్రజలు చెవుల్లో పూలుపెట్టే పనిచేస్తున్నారని ప్రకాశ్‌రాజ్‌ దుయ్యబట్టారు. అల్ప సంఖ్యాకులను దేశం నుంచి బయటికి పంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో బీజేపీపై ధ్వజమెత్తారు. దలితులకు తానే ఆశాకిరణమని ప్రధాని అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. గనుల యజమానులను క్షమించాల్సింది యడ్యూరప్ప కాదని, కర్ణాటక ప్రజలని అన్న ఆయన తన పోరాటంలో ఎలాంటి రాజకీయం, దురుద్దేశ్యం లేదని స్పష్టం చేశారు.

అయితే దీనికి మునుపు తన తోటి నటుడు ప్రకాశ్‌ రాజ్‌ ఆవేశపరుడంటూ వ్యాఖ్యానించారు సాయి కుమార్‌. త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సాయి కుమార్‌ బీజేపీ తరపున బాగేపల్లి నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.