Home రాజకీయాలు కార్యకర్తలు అప్రమత్తంగా టీడీపీ అక్రమాలపై పోరాడండి

కార్యకర్తలు అప్రమత్తంగా టీడీపీ అక్రమాలపై పోరాడండి

57
SHARE

వైఎస్సార్ స్ఫూర్తి తో పుట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసమే పాటుపడుతుందని పార్టీ నాయకుడు బొత్స సత్యనారయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధే థ్యేయంగా వైఎస్సార్ పని చేశారని చెప్పారు. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకుని చంద్రబాబు వ్యక్తిగత అభివృద్ధి కోసమే పని చేస్తున్నారని మండిపడ్డారు.

తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. తెలుగుదేశం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చివరికి మనకే అనుమానం వచ్చే రీతిలో ఇలాంటి అబద్దపు ప్రచారం చేస్తారని ఆయన హెచ్చరించారు.

2014 సాధారణ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటిని ముఖ్యమంత్రి చంద్రబాబు గాలికి వదిలేశారని, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, సంక్షేమ పథకాల ఫలాలు అందరికీ అందుతాయని బొత్స చెప్పారు. చంద్రబాబు పాలనలో జరుగుతున్న అక్రమాలు, అరాచకాలపై పోరాడాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ కు బిజెపితో అంటకట్టడానికి టిడిపి యత్నిస్తోందని, అదే సమయంలో బిజెపి ఆర్దిక మంత్రి సుదీర్ భార్యకు తిరుమల తిరుపతి దేవస్తానం ట్రస్టు బోర్డు సభ్యురాలిగా పదవి ఇచ్చారని, బిజెపి, టిడిపి విడిపోయాయి కదా అని అడిగితే అది తన వ్యక్తిగతం అని చంద్రబాబు సమర్దించుకుంటున్నారని బొత్స అన్నారు.