పౌరాణికమైనా, సాంఘీకమైనా.. ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే విలక్షణ నటుడు మన ఎస్వీ రంగారావు. ‘వివాహ భోజనంబు’ అంటే ‘వింతైన వంటకంబు’ అని అనని తెలుగు ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. ఆ ఘనత ఎస్వీ రంగారావుదే. అలాంటి మహానటుడిని మాయ శశిరేఖగా అనుకరించి మనందరి మన్ననలు పొందారు మన మహానటి సావిత్రి. అ మహానటుడి పాత్రలో మనముందుకు రాబోతోంది ఎవరు అనుకుంటున్నారా? అవును.. మీ ఊహ నిజమే.. వన్ అండ్ ఓన్లీ డాక్టర్ మోహన్‌బాబు గారికే అది సాధ్యం’ అంటూ నాని ఆ పాత్రను వీడియోలో పరిచయం చేశారు.
కీర్తి సురేశ్ టైటిల్ రోల్ పోషిస్తూ అలనాటి అందాల తార సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘మహానటి’. సమంత, విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రల్లో నటించారు. వైజయంతి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది, నాగ్ అశ్విన్ దర్శకుడు. మే 9న సినిమా విడుదల అవుతుంది.