Home సినిమా ఇషా అంబానీ కి పిరమల్ వారసుడి రొమాంటిక్ పెళ్లి ప్రొపోజల్?

ఇషా అంబానీ కి పిరమల్ వారసుడి రొమాంటిక్ పెళ్లి ప్రొపోజల్?

SHARE

అంబానీల ఇంట మరో పెళ్లి గంట మోగనుందా అంటే ఔననే చెప్పాలి. ఈ మధ్యనే ఆకాశ్ అంబానీ వివాహం అతని బాల్య స్నేహితురాలు శ్లోకమెహతా తో ఫిక్స్ చేయగా ఆకాష్ కవల సోదరి ఇషా కూడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు వార్త. ఇప్పటికే ఇషా ఎంగేజ్‌మెంట్ అయి పోయిందనే వార్త హల్‌చల్ చేస్తు౦ది. ఆకాశ్‌ పెళ్లి డిసెంబర్లో జరగనుండగా.. ఇషా అంబానీ వివాహం అజయ్ పిరమాళ్ కుమారుడు వారసుడైన ఆనంద్ పిరమాళ్‌ తో వున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.

ఇషాకు ఆనంద్ ప్రపోజ్ చేస్తోన్న రొమాంటిక్ ఫొటో ఇన్‌స్టాగ్రామ్‌లో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ పెళ్లి విషయమై ఇరు కుటుంబాల నుంచి ఎటువంటి అధికార ప్రకటన ఇంకా వెలువడలేదు. ఇషాను ఆనంద్ ముద్దాడుతున్న చక్కటి ఫొటోను హలో మ్యాగ్ ఇండియా వారు ఇష్ట పేజీలో షేర్ చేసి త్వరలోనే పెళ్లాడబోతున్నారని చెప్పింది.

ఇషా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, రిలయన్స్ రిటైల్ డైరెక్టర్‌గా ఉండగా .. ఆనంద్ ‘పిరమాళ్ ఎంటర్‌ప్రైజెస్’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ గా వున్నారు. వీరి పెళ్లి లో కొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.