Home రాజకీయాలు బాబు నీచంగా రాజకీయం చేస్తున్నారు

బాబు నీచంగా రాజకీయం చేస్తున్నారు

SHARE

చంద్రబాబు తన ప్రచారం కోసం దాచేపల్లి మానభంగం ఘటనలో బాదితురాలి తండ్రిని తన పక్కన కూర్యోబెట్టుకుని మాట్లాడడం శోచనీయమని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా అన్నారు. చంద్రబాబు ఇలాంటి ఘటనలను కూడా రాజకీయం చేస్తూ, ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ, తన వైఫల్యాన్ని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పై రుద్దడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె అన్నారు. ఎవరైనా బాదితులను గుర్తు పట్టేలా చేస్తారా అని ఆమె అన్నారు.

టీడీపీ హయాంలో మహిళలు ఇళ్లనుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి ఉందని రోజా అన్నారు. టీడీపీ హయాంలో ఇటువంటి ఘోరాలు జరుగుతున్నందుకు చంద్రబాబు బావిలో దూకాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రజలలో చైతన్యం, వైఎస్ ఆర్ కాంగ్రెస్ చేసిన ఆందోళన వల్లే ప్రభుత్వం కదలక తప్పలేదని ఆమె అన్నారు. దాచేపల్లి ఘటనలో ప్రజలలో చైతన్యం రావడం వల్ల స్పందించవలసి వచ్చిందని మరి ఇదే స్పందన మిగిలిన అత్యాచార బాదితుల విషయంలో ఎందుకు జరగలేదని ఆమె అన్నారు.

కథువా ఘటనకు బాధ్యత వహిస్తూ…ప్రధానిని రాజీనామా చేయమన్న చంద్రబాబు….దాచేపల్లి ఘటనకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దాచేపల్లి నిందితుడు తెలుగుదేశం పార్టీకి చెందినవాడని స్పష్టంగా ఐడి కార్డుతో సహా బయటపడితే కూడా చంద్రబాబు దాని గురించి మాట్లాడకుండా వైసిపిపై బురద చల్లుతున్నారని రోజా విమర్శించారు.