Home రాజకీయాలు లక్ష్మీనారాయణ యాత్రల ఎజెండా?

లక్ష్మీనారాయణ యాత్రల ఎజెండా?

SHARE

సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఏదో టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్నట్లుగా కనిపిస్తుంది. కేవలం స్వచ్చంద సేవ అయితే అబినందించవలసిందే. అలాకాకుండా ఏదైనా ఎజెండాతో పనిచేస్తే ఆ తర్వాత రోజులలో విమర్శలు ఎదురు కావచ్చు.

గుంటూరు జిల్లాలో ఒక గ్రామంలో రైతులతో భేటీ అయిన లక్ష్మీనారాయణ తాజాగా శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. మూతపడ్డ ఆముదాల వలస చక్కెర కర్మాగరం రైతులతో ఆయన భేటీ అయ్యారు. ఈ కర్మాగారాన్ని పునరుద్ధరించాలని కోరుతూ రైతులు చేపట్టిన లక్ష సంతకాల సేకరణ ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు.

ఆమదాలవలసలోని ఓ పాఠశాలకు వెళ్లి విద్యార్థులను చైతన్యం చేస్తూ ఉపన్యసించారు. నాగావళిపై ఉన్న నారాయణపురం ఆనకట్ట, వంశధారపై గొట్టాబ్యారేజీలను సందర్శించారు. కవిటి మండలంలోని సహలాలపుట్టుగ గ్రామంలో స్థానికులతో సమావేశమయ్యారు. శుక్రవారం రాత్రి అక్కడే పల్లె నిద్రకు ఉపక్రమించారు. ఇక్కడి సమస్యలను చూసిన ఆయన ఆ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దత్తత అంటే చిన్న విసయం కాదు కదా.. చాలా ఖర్చుతో కూడిన విషయం, మరి ఎలా చేస్తారో చూడాల్సిందే. ఈ పర్యటనల పరమార్దం ఏమిటో.. వెనక ఏవురున్నారో కాలమే చెప్పాలి!