Home సినిమా అబ్భా….సావిత్రిలా అబ్బురపరుస్తున్న కీర్తి సురేష్!!

అబ్భా….సావిత్రిలా అబ్బురపరుస్తున్న కీర్తి సురేష్!!

157
SHARE

అలనాటి మేటి నటి సావిత్రి జీవితకథ ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘మహానటి’ విడుదల కి ముస్తాబై రెడీగా ఉందన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఈ నెల 9న విడుదల కావొస్తున్న తరుణంలో చిత్ర యూనిట్‌ సినిమాకు సంబంధించి స్టిల్స్‌ పోస్టర్లు విడుదల చేస్తూ సగటు ప్రేక్షకుడిలో ఎంతో ఆసక్తి పెంచుతున్నారు.

ఇక కీర్తి తన ట్విట్టర్ అకౌంట్ లో మాయాబజార్‌ లో సావిత్రిలా వున్నా ఫొటోలను అభిమానులతో పంచుకొంది.

అబ్భా అంటూ అబ్బురపరిచేలా అచ్చం సావిత్రిలానే వున్న కీర్తి సురేష్‌ లుక్‌ విపరీతంగా వైరల్ అవుతోంది. అలనాటి మాయాబజార్ లో సావిత్రి లుక్‌ని, ఇప్పటి కీర్తి సురేష్‌లుక్‌ని జత చేసి నెటిజన్లు షేర్ చేస్తున్నారు. ఎంతగా కీర్తి సావిత్రి అయిపోయిందో కదా.

ఇంకో విషయమేమిటంటే ఈ సినిమాలో ఎవరు ఎన్టీఆర్‌ పాత్రలో నటిస్తున్నారన్న దానిపై చిత్ర యూనిట్ సస్పెన్స్ కొనసాగిస్తోంది!!