Home సినిమా మెహ్రీన్‌ స్టైల్‌ సూపర్బ్‌

మెహ్రీన్‌ స్టైల్‌ సూపర్బ్‌

81
SHARE

సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడే హాట్‌ పిక్స్‌తో తన అందానికి సంబంధించి తాజా ఆప్‌డేట్స్‌ అందిస్తోందీ మెహ్రీన్‌. ఇదంతా ఎందుకంటే, కొత్త సినిమాల్లో అవకాశాల కోసమే. ఆల్రెడీ గోపీచంద్‌తో ‘పంతం’ సినిమాలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యనే మరో క్రేజీ ఆఫర్‌ కూడా కొట్టేసింది.. మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతున్న ఎఫ్‌ 2 (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌) సినిమాలో సీనియర్‌ హీరో వెంకటేష్‌, యంగ్ హీరో వరుణ్‌తేజ్‌లు కలిసి నటిస్తున్నారు. దిల్‌ రాజు బ్యానర్‌ లో ఎఫ్‌ 2 సినిమాను తెరకెక్కిస్తున్నాడు అనిల్‌ రావిపూడి. ఈ చిత్రంలో మెహ్రీన్‌ హీరోయిన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే.

ఎఫ్‌ 2 షూటింగ్ జూన్‌ లో ప్రారంభిస్తున్నట్టుగా చిత్రయూనిట్‌ అధికారికంగా వెల్లడించారు. ఇలాంటి గొప్ప ప్రాజెక్ట్‌ తన చేతికి చిక్కడంతో చాలా ఆనందంగా ఉందంటోంది మెహరీన్‌. ఇకపోతే ఈ తాజా పిక్‌లో మెహ్రీన్‌ అందంతో పాటు, స్టైల్‌తోనూ ఆకట్టుకుంటోంది.