Home సినిమా ప్రభాస్‌ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్న హాట్ బ్యూటీ!

ప్రభాస్‌ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్న హాట్ బ్యూటీ!

73
SHARE

బాలీవుడ్ బ్యూటీ ఎవిలిన్ శర్మ ప్రభాస్ సాహో చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సాహో చిత్రం దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ దుబాయ్ లో శరవేగంగా జరుగుతోంది. ఎవిలిన్ శర్మ సాహో చిత్రంలో యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తోంది..

తాజగా ఎవిలిన్ శర్మ ప్రభాస్ తో దిగిన ఫోటోని తన ట్విటర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. అభిమానుల కోరిక మేరకు మొత్తానికి ప్రభాస్ తో ఫొటో దిగానని చెప్పుకొచ్చింది. ఈ బాలీవుడ్ బ్యూటీ మరో కోరికని కూడా ప్రభాస్ ముందు ఉంచడం విశేషం. ప్రభాస్ ప్రస్తుతం ట్విట్టర్ లో లేడు. అతడిని ట్విట్టర్ లోకి తీసుకుని వచ్చేందుకు కన్విన్స్ చేస్తున్నాని దానికి అభిమానుల సహకారం కూడా అవసరం అంటూ పేర్కొంది.