Home రాజకీయాలు గాంధీ, అల్లూరి సీతారామరాజు వంటి వారి లక్షణాలు బాబు లో…

గాంధీ, అల్లూరి సీతారామరాజు వంటి వారి లక్షణాలు బాబు లో…

82
SHARE

ఆంధ్ర లో పేరు ప్రఖ్యాతులున్న పారిశ్రామికవేత్త రఘురామ కృష్ణంరాజు టీడీపీలో చేరారు. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో ఇవాళ విజయవాడలో పార్టీ తీర్థం పుచ్చుకుని, కండువా కప్పుకున్నారు.

ఈ సందర్బంగా కృష్ణంరాజు తాను ఇవాళ పార్టీలో చేరుతున్నా పార్టీ నేతలతో మాత్రం చాలా కాలం నుంచే సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నట్లు అన్నారు. అంతే కాదు వచ్చే ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 సీట్లు సాధి౦చి తీరతామని ధీమా కూడా వ్యక్తం చేశారు. పార్టీ అధినేత తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు.

అంతటితో భట్రాజు లా లోకేష్ ని బాబుని పొగడ్తలతో ముంచెత్తారు. బాబు కార్యదక్షత, ఎన్టీఆర్‌ లా మంచి కలుపుగోలుతనం లోకేశ్‌లో మెండుగా ఉన్నాయని చెప్పారు. బాబు లో మహాత్మా గాంధీ, అల్లూరి సీతారామరాజు ల వంటి మహానేతల లక్షణాలు ఉన్నాయంటూ శ్లాఘి౦చారు.

అంతకు ముందు వైసీపీలో చేరి తర్వాత బయటకు వచ్చి బీజేపీలో చేరారు. కానీ కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఉన్నట్టు వుంది వస్తున్న పచ్చ జెండా ఊపారు.