Home రాజకీయాలు కృష్ణా జిల్లా ఉంటుంది.. ఎన్.టి.ఆర్ జిల్లా వస్తుంది

కృష్ణా జిల్లా ఉంటుంది.. ఎన్.టి.ఆర్ జిల్లా వస్తుంది

78
SHARE

వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎపిలో మొత్తం పాతిక నియోజకవర్గాలు అవుతాయని, అప్పుడు కృష్ణా జిల్లా రెండు జిల్లాలు అవుతుందని, అందులో ఒకదానికి మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్ పేరు పెట్టడం జరుగుతుందని ఆ పార్టీ అదికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు.

ఎన్టీఆర్ పుట్టిన ప్రాంతానికి ఆయన జిల్లా పేరు పెడతామని అంటే, కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని,  కృష్ణా  జిల్లా పేరును తొలగిస్తాం అంటూ మాట్లాడుతున్నారని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయంలో విష ప్రచారం చేస్తున్నారని, జగన్ చేసిన ప్రకటనకు వక్రభాష్యం చెబుతున్నారని ధ్వజమెత్తారు అంబటి రాంబాబు.

తాము ఎన్టీఆర్ పేరు పెడతామన్నది నిజమే కానీ, కృష్ణా పేరును తొలగిస్తామన్నది మాత్రం అబద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఎన్.టి.ఆర్ తమ పార్టీ వాడు కాకపోయినా విపక్ష నేత జగన్ ఆయనను గౌరవించడంతో టిడిపి వారు ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు. ఇంతకాలం జిల్లాకు, ఆ ప్రాంతానికి ఎన్.టి.ఆర్ పేరును చంద్రబాబు ఎందుకు పెట్టలేకపోయారని ఆయన ప్రశ్నించారు.

ఎన్.టి.ఆర్.గాని, వైఎస్ రాజశేఖరరెడ్డి కాని ప్రజల ఆదరణ కలిగిన మాస్ నేతలని ఆయన అన్నారు. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్.టి.ఆర్స్వ గ్రామం నిమ్మకూరు ఉందని, ఆ ప్రాంతానికి ఎన్.టి.ఆర్ పెడతారని, విజయవాడ ప్రాంతం కృష్ణా జిల్లాగా ఉంటుందని అన్నారు.

చంద్రబాబుకు ఎన్.టి.ఆర్ పై అబిమానం ఉంటే జగన్ నిర్ణయాన్ని మెచ్చుకుని ఉండాల్సిందని ఆయన అన్నారు.. కాని ఈర్ష్య పడుతున్నారని ఆయన అన్నారు. కడప జిల్లాలో కూడా కడప నియోజకవర్గానికి వైఎస్ ఆర్ పేరు ఉంటుందని, ఇంతవరకు కడపలో భాగంగా ఉన్న రాజంపేట మరో జిల్లా అవుతుందని రాంబాబు వివరించారు.