Home రాజకీయాలు దాచేపల్లి ఘటనపై పవన్ రియాక్షన్.. వైఎస్సార్‌సీపీ ఆందోళన

దాచేపల్లి ఘటనపై పవన్ రియాక్షన్.. వైఎస్సార్‌సీపీ ఆందోళన

70
SHARE

గుంటూరు జిల్లా దాచేపల్లి లో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం మీద జనసేన అదినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. తొమ్మిదేళ్ల బాలికపై 55 ఏళ్ల సుబ్బయ్య అత్యాచార ఘటనపై తీవ్రఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్విట్టర్‌లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు పవన్. కథువా నుంచి కన్యాకుమారి దాకా జరుగుతున్న అత్యాచార ఘటనల గురించి విన్నప్పుడల్లా తనతో సహా సమాజం కూడా తీవ్ర వేదనకి గురవుతోందని అన్నారు.

ఈరోజు దాచేపల్లి సంఘటన కూడా మనసును కలచి వేసింది. నిస్సహాయతకు గురిచేసింది. ఇలాంటి పరిస్థితిలో పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం అన్యాయానికి గురైన ఆ బిడ్డకు, కుటుంబానికి అండగా నిలబడాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. అసలు ఆడబిడ్డలపై ఇలాంటి ఆరాచకాలకు పాల్పడే వ్యక్తులు భయపడే పరిస్థితి రావాలంటే పబ్లిక్‌గా శిక్షించే విధానాలు రావాలని నేను కోరుకుంటున్నానని పవన్‌ అబిప్రాయపడ్డారు.

కాగా ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆరా తీశారు. నిందితుడిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ బాధితురాలి కుటుంబసభ్యులకు మద్దతుగా ఆందోళనల్లో పాల్గొంది. పలు చోట్ల అధికార, విపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలతో ఘర్షణ వాతావరణం నెలకొంది.