Home రాజకీయాలు దాచేపల్లిలో మైనర్ పై అత్యాచారం.. మిన్నంటుతున్న నిరసనలు

దాచేపల్లిలో మైనర్ పై అత్యాచారం.. మిన్నంటుతున్న నిరసనలు

SHARE

గుంటూరు జిల్లా దాచేపల్లి వద్ద జరిగిన మైనర్ బాలిక పై అత్యాచార ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాశ్మీర్ లోని కతువా వద్ద యుపిలో ఉన్నావ్ వద్ద జరిగిన మానభంగం ఘటనల గురించి విమర్శలు చేసిన రెండు రోజులకే దాచేపల్లి వద్ద ఒక మైనర్ బాలిక పై సుబ్బయ్య అనే ఏభై ఏళ్లకు పైగా ఉన్న వ్యక్తి అత్యాచారం చేశాడని వెల్లడైంది.

మైనర్‌ బాలికపై అత్యాచార ఘటనతో దాచేపల్లి అట్టుడుకిపోతోంది. ఆ బాలిక కుటుంబం, ఇతర బందువులు దాచేపల్లి వద్ద రాస్తరకో చేసి ఆందోళనకు దిగడంతో ఈ విషయం అందరి దృష్టికి వెళ్లింది. బాలికను ఆస్పత్రికి తరలించారు. గత పది రోజులలో ఆరుగురు మైనర్ బాలికలపై అత్యాచార ఘటనలు జరిగాయి. తెనాలి, పల్నాడు తదితర ప్రాంతాలలో ఈ ఘటనలు జరిగాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసి నిందితుడిని పట్టుకోవడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినట్లు ఒక ప్రకటన వెలువడింది.