Home సినిమా అల్లు అర్జున్‌ క్యాప్‌ ట్రిక్స్ వీడియోలు.. వైరల్

అల్లు అర్జున్‌ క్యాప్‌ ట్రిక్స్ వీడియోలు.. వైరల్

79
SHARE

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘నా పేరు సూర్య’ సినిమా విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. తాజాగా బన్నీ తన ట్విట్టర్‌ ఖాతాలో రెండు వీడియోలు పోస్ట్ చేశాడు. అందులో ఒక దాంట్లో అల్లు అర్జున్‌ క్యాప్‌తో ట్రిక్స్ ప్రయత్నిస్తున్నాడు.

‘నా పేరు సూర్య’ సినిమాలోని ‘లవర్ ఆల్సో.. ఫైటర్ ఆల్సో ‘ అనే పాటలో బన్నీ ఈ ట్రిక్‌ ప్రయోగించాడు. అందుకోసం తను ట్రైనింగ్‌ తీసుకుంటుండగా ఈ వీడియో తీశారు. ఏడాది సమయం పట్టే ఎన్నో ట్రిక్కులను బన్నీ హార్డ్‌వర్క్‌తో కేవలం రెండు నెలల సమయంలోపే నేర్చుకున్నారంటూ యూనిట్ పేర్కొంది.

దీనిపై దర్శకుడు వక్కంతం వంశీ, ఇతర యూనిట్ మాట్లాడుతూ బన్నీ నిబద్ధతను కొనియాడారు. ప్రతిరోజూ షూటింగ్ అయిపోగానే అల్లు అర్జున్ క్యాప్ ట్రిక్ ట్రై చేయడం.. అది కేవలం ట్రిక్ కాదండీ, అల్లు అర్జున్ రెండు నెలల కష్టమండీ. ఈ క్యాప్ ట్రిక్ కోసం ఆయన ఎంత కష్టపడ్డారో నాకు తెలుసునండీ అని వక్కంతం వంశీ అన్నారు.

లగడపాటి శ్రీధర్‌, నాగబాబు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ మే 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. బన్నీ క్యాప్‌ ట్రిక్స్ వీడియో మీ కోసం..