Home సినిమా ‘నేల టిక్కెట్టు’ ఆడియో కోసం పవన్‌

‘నేల టిక్కెట్టు’ ఆడియో కోసం పవన్‌

SHARE

రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘నేల టిక్కెట్టు’.  ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ఆడియో వేడుకను ఈ నెల 12న అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలతో వరుస విజయాలు అందుకున్న కల్యాణ్‌ కృష్ణ ఈ సినిమాకు దర్శకుడు. పవన్‌ ఆడియో రిలీజ్‌ కు ముఖ్య అతిథిగా హాజరైతే సినిమా మీద హైప్‌ క్రియేట్‌ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్‌. రవితేజ సరసన మాళవిక శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను రామ్‌ తళ్లూరి నిర్మిస్తున్నారు. ఫిదా ఫేం శక్తి కాంత్‌ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను మే 24న రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు చిత్రయూనిట్‌.