Home రాజకీయాలు బ్రిటిష్ వాళ్లపైనే పోరాడిన తెలుగుదేశం పార్టీ.. చంద్రబాబుపై నెటిజన్ల సెటైర్లు

బ్రిటిష్ వాళ్లపైనే పోరాడిన తెలుగుదేశం పార్టీ.. చంద్రబాబుపై నెటిజన్ల సెటైర్లు

64
SHARE

రాజకీయనాయకులన్నాక ఒకటో రెండో అబద్ధాలు చెప్పడం మామూలే గాని టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు చెప్పేవి మాత్రం మరీ తెలుగుదేశం నేతలు  మొహమాట పడేలా ఉంటాయి. పదే పదే ఆయన చెప్పిన మాటలను సాక్ష్యాలతో చూపించినా బాబు మారట్లేదు. చంద్రబాబు.. టెక్నాలజీ విప్లవం నుంచి పుట్టిన సోషల్ మీడియాలో ట్రోలర్స్ కు బంతిలా మారాడు.

నిన్న చంద్రబాబు చేసిన వ్యాఖ్య సోషల్ మీడియాలో మరోసారి హాట్ ట్రోల్ అయ్యింది. తిరుపతిలో జరిగిన ధర్మ పోరాట సభలో సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ‘బ్రిటిష్ వాళ్లపైనే పోరాడిన తెలుగుదేశం పార్టీ’ అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు.

అసలు తెలుగుదేశం ఆవిర్భవించిందే 1982లో అయితే బ్రిటీష్‌ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ఎలా పోరాడుతుందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. జగన్ గురించి ఆలోచించడం మానేసి రాష్ట్రం గురించి ఆలోచిస్తే కొంతయినా మేలు జరుగుతుంది ఏపీకి.. ఈ విషయం చంద్రబాబు తెలుసుకుంటే అందరికీ మంచిది.