Home సినిమా ‘నా పేరు సూర్య’ తెలుగు రాష్ట్రాల స్పెషల్ షోలకు ఓకే!

‘నా పేరు సూర్య’ తెలుగు రాష్ట్రాల స్పెషల్ షోలకు ఓకే!

74
SHARE

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా’. లగడపాటి శ్రీధర్‌, నాగబాబు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ మే 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇటీవల పవన్ కళ్యాణ్ విషయంలో జరిగిన కొన్ని పరిణామాలతో ఈ సినిమా స్పెషల్ షోల విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో సమస్య ఏర్పడే అవకాశం ఉందని, స్పెషల్ షోలు ఉండే అవకాశం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలతో మెగా అభిమానుల్లో అయోమయం నెలకొంది.

అయితే ఈ చిత్రానికున్న క్రేజ్ దృష్ట్యా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఐదవ షో (ప్రత్యేక షో) వేసుకునేందుకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినట్టు నిర్మాతలు ప్రకటించారు. ఈ నెల 4వ తేదీ నుంచి ఐదు షోలు ప్రదర్శించేందుకు అనుమతి ఇవ్వడంతో చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేసింది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ… అల్లు అర్జున్ హీరోగా నటించిన నా పేరు సూర్య చిత్రానికి ఎంతటి క్రేజ్ నెలకొందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్ర ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ అయిన తర్వాత ఆ క్రేజ్ డబుల్ అయింది. మే 4న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి ఐదవ ఆటను కూడా ప్రదర్శించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అనుమతినివ్వడం చాలా సంతోషంగా ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చేస్తున్న కృషిలో ఇది ఓ భాగం. ఓవైపు వేసవి సెలవులు కావడం… మరోవైపు ఈ సినిమాకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో మరో షోకు అనుమతి ఇవ్వడం నిజంగా సంతోషించదగ్గ విషయం. ఈ సందర్భంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు మా చిత్ర యూనిట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.