Home రాజకీయాలు సచివాలయానికి మళ్లీ చిల్లులు.. జగన్ చాంబర్ లో వర్షపు నీరు

సచివాలయానికి మళ్లీ చిల్లులు.. జగన్ చాంబర్ లో వర్షపు నీరు

80
SHARE

గత ఏడాది జూన్ లో సచివాలయంలో సాక్ష్యాత్తూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చాంబర్ లో భారీగా వర్షపు నీరు చేరడంతో బాబుగారి డొల్లతనం మొదటిసారి బయటపడింది. బాబుగారి మాటలు `వర్షపు`నీటి మూటలని తాజాగా మరోసారి రుజువైంది. తాజాగా మంగళవారం నాడు జగన్ చాంబర్ లో మరోసారి వర్షపు నీరు లీకేజీ కావడం చంద్రబాబు నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

గత ఏడాది మాదిరిగానే ప్రతిపక్ష నేత జగన్ ఛాంబర్లో నీరు యథా ప్రకారం లీక్ అవడం గమనార్హం. గత ఏడాది కూడా ఈ తరహాలో వర్షపు నీరు చేరడంతో వైసీపీ నిరసన చేపట్టింది. పైపులను కోసేశారంటూ స్పీకర్ ఆదేశించిన విచారణ కమిటీ నివేదిక ఇచ్చింది. తాజాగా మళ్లీ పాత సీన్ రిపీటవడంతో కోట్లు ఖర్చుపెట్టి వెలగపూడిలో నిర్మించిన ఏపీ సచివాలయ డొల్లతనం మరోసారి బయటపడినట్లయింది.

ప్రపంచ స్థాయి రాజధాని అంటూ గప్పాలు కొట్టే చంద్రబాబు..చిన్నపాటి లీకేజీని కూడా అరికట్టలేకపోయారు. చిన్నపాటి వర్షానికే ఈ పరిస్థితి ఉంటే..ఇక భారీ వర్షాలు పడితే పరిస్థితి ఏమిటో అని పలువురు సచివాలయ ఉద్యోగులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కావాలనే జగన్ చాంబర్ లో మరమ్మతులు చేయించలేదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇదంగీ బాబుగారి పాలన అంటూ నిట్టూర్పు విడుస్తున్నారు..నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.