Home సినిమా సూపర్ స్టార్ మహేష్ ఫామిలీతో జాలీ ఫారిన్ ట్రిప్

సూపర్ స్టార్ మహేష్ ఫామిలీతో జాలీ ఫారిన్ ట్రిప్

SHARE

సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తాడు. భార్యా పిల్లలతో కలిసి మహేష్ వేసినన్ని ఫారిన్ ట్రిప్పులు బహుశా మరే టాలీవుడ్ హీరో తిరగలేదంటే ఆశ్చర్యమేమీ లేదు. సహజంగా సినిమా షూటింగ్ సమయంలో బ్రేక్ వస్తేనే వెకేషన్ ప్లాన్ చేసేస్తుంటాడు మహేష్. మహేష్ భరత్ అనే నేను మూవీ విడుదల తర్వాత అగ్రెసివ్ గా ప్రమోట్ చేసి.. సినిమాను హిట్టు తీరానికి తీసుకొచ్చాడు.

సుదీర్ఘకాలంగా ఈ చిత్రంపై పని చేసిన మహేష్ ఇప్పుడు తన ఫ్యామిలీతో కలిసి ప్యారిస్ అంతా చుట్టేయాలన్నది సూపర్ స్టార్ ఐడియా. మొదట ప్యారిస్ లో ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి మరికొన్ని యూరోపియన్ కంట్రీస్ లో కూడా చక్కర్లు కొడతారట. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టు లో మహేష్ బాబుతో పాటు భార్య నమ్రతా మహేష్, కొడుకు గౌతమ్, కూతురు సితార కనిపించారు.

అక్కడి నుంచి కొన్ని ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నమ్రత. నాన్నకూచిగా సితార కనిపిస్తుంటే.. తన గారాల పట్టితో భలే ఎంజాయ్ చేస్తున్నాడు మహేష్ బాబు.

 

En route Paris ❤️❤️❤️❤️happy holidays everyone 🤗🤗

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on