Home రాజకీయాలు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెడతా : వైఎస్‌ జగన్‌

కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెడతా : వైఎస్‌ జగన్‌

78
SHARE

కృష్ణా జిల్లాను ఎన్టీఆర్‌ జిల్లాగా మార్చుతామని వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నిమ్మకూరు నియోజకవర్గంలోకి ప్రవేశించిన ఆయన వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే ఎన్టీఆర్‌ పేరును జిల్లాకు పెడతామని చెప్పారు.

తెలుగు ప్రజలకు ముఖ్యంగా బలహీన వర్గాల కోసం ఎన్టీఆర్‌ తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన పుట్టిన గడ్డ నిమ్మకూరుకు నా పాదయాత్ర చేరిన సందర్భంగా ఎన్టీఆర్‌కు నివాళులు అర్పిస్తూ కృష్ణాజిల్లా పేరును నందమూరి తారక రామారావు జిల్లాగా మారుస్తామని ప్రమాణం చేస్తున్నానని… వైఎస్‌ జగన్‌ ఈ సందర్భంగా ట్విట్‌ చేశారు.

వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిమ్మకూరును అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. మరోవైపు కృష్ణాకు ఎన్టీఆర్‌ పేరును పెడతామనే వైఎస్‌ జగన్‌ ప్రకటనపై గ్రామస్థులు, ఎన్టీఆర్‌ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ వంటి మహానాయకుడికి ఇది చక్కని గౌరవమని అభిప్రాయపడ్డారు.