Home రాజకీయాలు 175 స్థానాల్లో జనసేన పోటీ..వ్యూహకర్తగా దేవ్‌

175 స్థానాల్లో జనసేన పోటీ..వ్యూహకర్తగా దేవ్‌

72
SHARE

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2019లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 175 సీట్లలో పోటీ చేయనున్నట్లు పవన్ ప్రకటించారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల వ్యూహకర్తగా దేవ్‌ని నియమించారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్రంలో తమ పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోబోతున్నట్లు పవన్ స్పష్టం చేశారు. ఈ నెల 11న రాష్ట్రంలో తన పర్యటన వివరాల షెడ్యూల్ విడుదల చేస్తానన్నారు. తెలంగాణలో పోటీ విషయాన్ని ఆగస్టులో వెల్లడిస్తానని పవన్ తెలిపారు.

ఏపీలోని 13 జిల్లాల నుంచి వచ్చిన పార్టీ కీలక నేతలతో హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ సమావేశమయ్యారు. పక్కాగా రూపొందిస్తున్న ఎన్నికల వ్యూహంతో ముందుకు వెళదామని పార్టీ నేతలకు పవన్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రణాళిలకు, సంస్థాగత నిర్మాణపరమైన విధానాల రూపకల్పనకు దేవ్ పార్టీతో ఉంటారని, గత 10 నెలలుగా జనసేనకు పనిచేస్తున్నారని పవన్ తెలిపారు.