Home సినిమా అప్పుడు మనస్ఫూర్తిగా ఏడ్చేస్తా: పూజా హెగ్డే

అప్పుడు మనస్ఫూర్తిగా ఏడ్చేస్తా: పూజా హెగ్డే

SHARE

ఫెయిల్యూర్‌ని తీసుకోవడం గురించి పూజా హెగ్డే మాట్లాడుతూ ‘‘మనం కష్టపడి చేసిన పనికి అనుకున్న రిజల్ట్‌ రాకపోవచ్చు.

‘‘ఏ ప్రయాణంలో అయినా గెలుపోటములు సహజం.  ఈ రెంటినీ సమానంగా తీసుకుంటేనే ముందుకు వెళ్లగలం. కానీ ఈ రెండు విషయాల్ని అందరూ ఒకేలా తీసుకోవాలనే రూలు లేదు. నా విషయానికి వస్తే.. ఏదైనా ఫెయిల్యూర్‌ వస్తే పదిహేను నిమిషాలు ఏడ్చేస్తాను’’ అన్నారు పూజా హెగ్డే.

ఓడినంత మాత్రాన ప్రయాణం ఆగినట్టు కాదు. గెలిచినంత మాత్రాన ప్రయాణం పూర్తయినట్టూ కాదు. అయితే ఓడిపోయినప్పుడు కచ్చితంగా బాధపడతాం. నేనైతే ఒక పదిహేను నిమిషాలు మనస్ఫూర్తిగా ఏడ్చేస్తాను. బాధ మొత్తం పోతుంది. అలా అప్పటికప్పుడు మనం ఏదో ఒక విధంగా బాధను పోగొట్టుకోవాలి. మళ్లీ పాజిటివ్‌ మైండ్‌తో నెక్ట్స్‌ చాలెంజ్‌కు రెడీ అయిపోవాలి’’ అని పూజా పేర్కొన్నారు.