Home సినిమా ముచ్చటగా మూడోసారి

ముచ్చటగా మూడోసారి

SHARE
Kajal Ravi Teja Hot Pics in Veera Movie

రవితేజ, కాజల్‌ అగర్వాల్‌ ముచ్చటగా మూడోసారి జోడీ కడుతున్నారట. ‘వీర, సారొచ్చారు’ చిత్రాల్లో ప్రేక్షకులను అలరించిన ఈ జంట మరోసారి సందడి చేయనున్నారట. కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో రవితేజ నటించిన ‘నేల టిక్కెట్టు’ సినిమా మే 24న విడుదల కానుంది.

ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’ అనే చిత్రంలో నటిస్తున్నారు. శ్రీను వైట్ల మూవీకి గుమ్మడికాయ కొట్టగానే సంతోష్‌ శ్రీనివాస్‌ చిత్రానికి కొబ్బరికాయ కొట్టనున్నారు రవితేజ.

ఈ సినిమా తర్వాత సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు రవితేజ. ఈ చిత్రంలో ఆయనకి జోడీగా కాజల్‌ని ఎంపిక చేశారట.