Home సినిమా అమెరికా 3 మిలియన్ల క్లబ్ లో `భరత్ అనే నేను`

అమెరికా 3 మిలియన్ల క్లబ్ లో `భరత్ అనే నేను`

92
SHARE

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హిట్ దర్శకుడు కొరటాల శివల కాంబోలో తెరకెక్కిన `భరత్ అనే నేను`సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయి.. మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచిన చిత్రం. ఇండియా తో పాటు ఓవర్సీస్ లో కూడా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. తాజాగా అమెరికాలో ఈ చిత్రం 3 మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరింది.

సామాజిక కథాంశంతో రూపొందిన `భరత్ అనే నేను` రికార్డు కలెక్షన్లను వసూలు చేస్తూ .. మహేష్ నటించిన చిత్రాలలో కెల్లా అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగా భరత్ మరో రికార్డు క్రియేట్ చేసింది. అమెరికాలో ఈ సినిమా కలెక్షన్లు 3 మిలియన్ మార్క్ ను దాటినట్టు నిర్మాత డీవీవీ దానయ్య తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. అమెరికాలో 3 మిలియన్  డాలర్లు వసూలు చేసిన చిత్రాల్లో బాహుబలి-2 – బాహుబలి-1 – రంగస్థలం తర్వాత భరత్ అనే నేను ఉండడం విశేషం.