Home ప్రత్యేకం ‘నాపేరు సూర్య’ పై క‌క్ష క‌డ‌తారేమో

‘నాపేరు సూర్య’ పై క‌క్ష క‌డ‌తారేమో

78
SHARE

`నా పేరు సూర్య` సినిమాపై గ‌త కొన్ని రోజులుగా ఇండ్ర‌స్ట్రీలో సాగుతున్న సెగ ప‌డ‌నుందా? ఈ సినిమాపై కొన్ని వ‌ర్గాలు, మీడియా శ‌క్తులు క‌క్ష క‌ట్టే అవ‌కాశాలున్నాయ‌ని హెచ్చ‌రిస్తున్నారు అల్లు అర‌వింద్‌. నా పేరు సూర్య ఆడియో ఫంక్ష‌న్‌లో అర‌వింద్ మాట‌లు క‌ల‌కలం రేపాయి. ”ఇండ్ర‌స్ట్రీలో సాగుతున్న ప‌రిణామాలు మీ అంద‌రికీ తెలుసు. ఈ సినిమాపై క‌క్ష క‌ట్టే అవ‌కాశాలున్నాయి. ప‌నిగ‌ట్టుకుని డివైడ్ టాక్ సృష్టిస్తారు. విమ‌ర్శ‌కులు చేస్తారు. ఈ వేదిక వెనుక ఓ విష‌యం జ‌రిగింది. అది త‌ర‌వాత చెబుతాను” అని ఆవేశంగా మాట్లాడారు. దాంతో ఎవ‌రు `సూర్య‌`కి వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేయ‌నున్నారు? అనే అనుమానాలు, ప్ర‌శ్న‌లు రేకెత్తుతున్నాయి.

మెగా కుటుంబానికీ కొన్ని మీడియా సంస్థ‌ల‌కు మ‌ధ్య ప్ర‌చ్ఛ‌న్న యుద్ధం జ‌రుగుతోంది. మెగా ఫ్యామిలీకి సంబంధించిన సినిమాల యాడ్లు కొన్ని టీవీ ఛాన‌ళ్ల‌కు ఇవ్వ‌కూడ‌ద‌ని మెగా హీరోలు నిర్ణ‌యించుకున్న‌ట్టు వార్త‌లొస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో అర‌వింద్ చేసిన వ్యాఖ్య‌లు కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.