Home రాజకీయాలు కన్నా.. మరో తప్పటడుగా?

కన్నా.. మరో తప్పటడుగా?

99
SHARE

కన్నా లక్ష్మీనారాయణ… వైఎస్సార్ హయాంలో ఒక వెలుగు వెలిగిన నేత! ఇటు కాపు సామాజిక వర్గంలో పట్టున్న నేతగా చలామణి అవుతూ.. ఇటు మంత్రిగా కూడా పనిచేశారు. అయితే రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జరిగిన పరిణామాలతో కాంగ్రెస్ పరిస్థితి పాతాళానికి పడిపోవడంతో.. ఇలాంటి సీనియర్లంతా చెట్టుకొకరు, పుట్టకొకరు అయిపోయారు!! ఈ పరిస్థితిలో కాస్తైనా కృతజ్ఞతాబావం కరువయ్యో ఏమో కానీ.. అనంతరం జగన్ వెంటనడిచే ఆలోచన చేయలేదు. అయితే తాజాగా బీజేపీ పరిస్థితి, ఆ పార్టీ ఆయనకు మిగిల్చిన నిరాశానుభవం అనంతరం… వైకాపా లో చేరాలా.. టీడీపీలోకి దూకాలా అనేది కన్నా లక్ష్మీ నారాయణ తాజా ఆలోచనగా చెబుతున్నారు!!

రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పరిస్థి.. తాజా రాజకియ పరిణామాల నేపథ్యంలో జాతీయ పార్టీల్లో బీజేపీ పరిస్థితి ఏపీలో దాదాపుగా సమానంగా మారుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కన్నా లక్ష్మీ నారాయణ చూపు నిన్నటివరకూ వైకాపా వైపు ఉందని లీకులు వచ్చాయి. అయితే ఈ క్రమంలో టీడీపీ నుంచి కూడా ఆహ్వానాలు రావడంతో.. సైకిల్ ఎక్కే దిశగా కూడా కన్నా ఆలోచిస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కన్నా.. మరో తప్పటడుగు వేస్తున్నారనే కామెంట్స్ కొంతమంది కార్యకర్తలు వ్యక్తపరుస్తున్నారు.

శాస్వత స్థిరత్వంకంటే.. తాత్కాలిక ఆనందాలవైపు మల్లిన కన్నా లక్ష్మీనారాయణ.. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ జెండా ఎత్తుకున్నారు. అది చాలా పెద్ద తప్పటడుగు అని తెలుసుకోవడానికి ఆయనకు ఎక్కువసమయమేమీ పట్టలేదనే అనుకోవాలి! ఈ క్రమంలో ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో.. మునిగిపోతున్న నావగా ఉన్న టీడీపీ వైపు కన్నా చూపు.. అనే కథనాలు.. ఆయన అభిమానుల్లో తీవ్ర నిరాశను కలిగిస్తున్నాయని తెలుస్తుంది! అదే జరిగితే.. ఆయన రాజకీయ జీవితంలో ఈ నిర్ణయం మరో తప్పటడుగుగా మిగిలిపోతుందని అంటున్నారు అభిమానులు!!

అయితే… ఏపార్టీలో చేరాలనే విషయంలో కన్నా కు రెండు డిమాండ్లు ఉన్నాయని తెలుస్తుంది. వాటిలో ప్రధానమైంది.. ఆయనకు కావాల్సిన ఎమ్మెల్యే స్థానం గురించి! వీటిలో కన్నా… పెద‌కూర‌పాడు లేదా గుంటూరు వెస్ట్ సీటువైపు ఆసక్తి కనబరుస్తున్నారని తెలుస్తుంది! ఈ క్రమంలో కేవలం సీటు ప్రాతిపదికన కన్నా నిర్ణయాలు తీసుకుంటారా.. లేక శాస్వత రాజకీయ భవిష్యత్తువైపు ఆలోచించి అడుగులు వేస్తారా అనేది వేచి చూడాలి!