Home సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’ మూవీ రివ్యూ

‘ఆచారి అమెరికా యాత్ర’ మూవీ రివ్యూ

SHARE

రివ్యూ: ఆచారి అమెరికా యాత్ర

రేటింగ్‌: 2/5

బ్యానర్‌: పద్మజ పిక్చర్స్‌
తారాగణం: విష్ణు మంచు, ప్రగ్యా జైస్వాల్‌, బ్రహ్మానందం, ప్రదీప్‌ రావత్‌, అనూప్‌ సింగ్‌ ఠాకూర్‌, ప్రభాస్‌ శ్రీను, ప్రవీణ్‌, పృధ్వీ, పోసాని, కోట శ్రీనివాసరావు, సురేఖావాణి, విద్యుల్లేఖారామన్‌, సత్య కృష్ణన్‌ తదితరులు
కథ: మల్లాది వెంకటకృష్ణమూర్తి
మాటలు: డార్లింగ్‌ స్వామి
ఎడిటింగ్‌: ఎమ్‌.ఆర్‌. వర్మ
సంగీతం: ఎస్‌.ఎస్‌. తమన్‌
ఛాయాగ్రహణం: సిద్ధార్థ్‌ రామస్వామి
నిర్మాతలు: కీర్తి చౌదరి, కిట్టు
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.నాగేశ్వర్‌రెడ్డి
విడుదల తేదీ: ఏప్రిల్‌ 27, 2018

మంచు విష్ణు, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో గతంలో వచ్చిన ‘దేనికైనా రెడీ’ చిత్రం మంచి విజయం సాధించింది. తాజాగా ఈ హిట్ కాంబినేషన్లో మరో కామెడీ ఎంటర్టెనర్ ‘ఆచారి అమెరికా యాత్ర’ పేరుతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘దేనికైనా రెడీ’ చిత్రంలో పూజారులుగా నటించిన విష్ణు, బ్రహ్మీ మరోసారి ఇలాంటి పాత్రలతోనే ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయడానికి రావడం గమనార్హం. మరి ఆచారి అమెరికా యాత్ర వెనక ఉన్న అసలు కథ ఏమిటి? ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది అనేది ఓసారి సమీక్షిద్దాం.

కథ :

కృష్ణమాచారి(మంచు విష్ణు) పురోహిత్యంలో ఘనాపాటి అప్పలాచారి (బ్రహ్మానందం) వద్ద శిష్యరికం చేస్తుంటాడు. ఓసారి అప్పలాచారి శిష్యబృందంతో కలిసి వేలకోట్ల అధిపతి చక్రపాణి(కోట శ్రీనివాసరావు) ఇంట్లో హోమం నిర్వహించేందుకు వెళతాడు. హోమం చేసేందుకు ఇంటికి వచ్చిన కృష్ణమాచారి, రేణుకతో ప్రేమలో పడతాడు. రేణుకకు కూడా కృష్ణమాచారి మీద ప్రేమ కలుగుతుంది. హోమం చివరి రోజు కార్యక్రమాలు జరుగుతుండగానే చక్రపాణి చనిపోతాడు. హోమం పొగ కారణంగానే చక్రపాణి చనిపోయాడని ఆయన అల్లుడు సుబ‍్బరాజు ( ప్రదీప్‌ రావత్‌) అప్పలాచారి, కృష్ణమాచారిలను చంపాలనుకుంటాడు. అక్కడి నుంచి తప్పించుకున్న అప్పలాచారి, కృష్ణమాచారి దేశం వదిలిపోవటమే కరెక్ట్‌ అని నిర్ణయించుకుంటారు. కృష్ణమాచారి తనకు అమెరికాలో స్నేహితుడు ఉన్నాడని అబద్ధం చెప్పి అప్పలాచారిని అమెరికా తీసుకొని వెళతాడు. అసలు కృష్ణమాచారి అమెరికా వెళ్లాలని ఎందుకు అనుకున్నాడు..? చక్రపాణి నిజంగా హోమం కారణంగానే చనిపోయాడా..? కృష్ణమాచారి రేణుకను ఎలా దక్కించుకున్నాడు..? అన్నదే మిగతా కథ.

నటీనటులు :

మంచు విష్ణు గతంలో దేనికైనా రెడీ సినిమాలో కనిపించినట్టుగానే ఈ సినిమాలోనూ కనిపించాడు. దాదాపుగా అదే తరహా లుక్‌, క్యారెక్టరైజేషన్‌తో ఆకట్టుకునే ప్రయత్నం  చేశాడు. తన పరిథి మేరకు కృష్ణమాచారి పాత్రకు న్యాయం చేశాడు. ముఖ్యంగా యాక్షన్‌ సీన్స్‌లో మంచు విష్ణు పర్ఫామెన్స్‌ ఆకట్టుకుంటుంది. సీనియర్‌ నటుడు బ్రహ్మానందం తనకు అలవాటైన పాత్రలో మెప్పించారు. బ్రాహ్మాణుడి పాత్రలు చేయటం బ్రహ్మీకి కొట్టిన పిండి. కానీ బ్రహ్మీని పూర్తి స్థాయిలో వాడుకునే సన్నివేశాలు సినిమాలో పెద్దగా కనిపించవు. పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే కృష్ణమాచారిగా మంచు విష్ణు పర్ఫెక్టుగా నటించారు. తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌‌ నటన పరంగా తనను తాను నిరూపించుకునే సీన్లు పడక పోయినా.. అందంతో మెప్పించింది. అనూప్‌ సింగ్‌ థాకూర్‌ తెరమీద కనిపించింది కొద్ది సేపే అయినా.. ఉన్నంతలో మంచి విలనిజం పండించాడు. హీరో ఫ్రెండ్స్‌ ప్రభాస్‌ శ్రీను, ప్రవీణ్‌లు నవ్వించే ప్రయత్నం చేశారు. ఇతర పాత్రల్లో కోటా శ్రీనివాసరావు. ప్రదీప్ రావత్‌, రాజా రవీంద్ర తమ పాత్రలకు న్యాయం చేశారు.

విశ్లేషణ :
మంచు విష్ణుతో హ్యాట్రిక్‌ సక్సెస్‌ కోసం ప్రయత్నించిన జీ.నాగేశ్వరరెడ్డి పెద్దగా ప్రయోగాల జోలికి వెళ్లకుండా సేఫ్‌ గేమ్‌ ఆడాడు. గతంలో మంచు విష్ణుకు ఘనవిజయాన్ని అందించిన దేనికైనా రెడీ తరహాలోనే కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే పెద్దగా కొత‍్తదనం లేని కథా కథనాలు ఎంచుకున్న దర్శకుడు.. ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రమోట్‌ చేసినా.. సినిమాలో ఆ స్థాయి కామెడీ ఎక్కడా కనిపించకపోవటం నిరాశపరుస్తుంది. సినిమాటోగ్రఫి బాగుంది. అమెరికా లోకేషన్లతో పాటు పాటలు విజువల్‌గా బాగున్నాయి. తమన్ అందించిన సంగీతం పరవాలేదు. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్

మంచు విష్ణు, బ్రహ్మానందం కాంబినేషన్

సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్

కథ, కథనం

డైరెక్షన్

సంగీతం లాజిక్ లేని సీన్లు

ఇంకా చాలా అంశాలు