Home రాజకీయాలు జడ్జిల నియామకంపై స్పందించిన జగన్

జడ్జిల నియామకంపై స్పందించిన జగన్

SHARE

బీసీ, ఎస్సీ సామాజికవర్గాలకు చెందిన న్యాయవాదులను హైకోర్టు జడ్జీలుగా నియమించకుండా వారికి వ్యతిరేకంగా కేంద్ర న్యాయశాఖకు చంద్రబాబు నివేదికలు పంపడం, ఆ విషయాన్ని జస్టిస్ ఈశ్వరయ్య బయటపెట్టడంతో బాబు టార్గెట్ అయ్యారు. బీసీలు, ఎస్సీలు బాబుపై మండిపడుతున్నారు. ఈ అంశంపై వైఎస్‌ జగన్‌ స్పందించారు. చంద్రబాబు బీసీలను అణగదొక్కుతున్నారన్న విషయం ఈశ్వరయ్య లేఖలతో స్పష్టమైందన్నారు. బీసీలపై చంద్రబాబుకు ప్రేమ ఎలాంటిదో దీనిబట్టి అర్థమవుతోందన్నారు.

‘నోరు తెరిస్తే బీసీల సంక్షేమం అనే చంద్రబాబు ఎందుకు బీసీ న్యాయవాదులను జడ్జిలు కాకుండా అడ్డుకుంటున్నారు? వారి నియామకాలను అడ్డుకునేలా తప్పుడు ఫీడ్‌బ్యాక్‌ ఎందుకు ఇస్తున్నారు?’ అని ట్విటర్‌లో వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు.

బీసీ వర్గానికి చెందినఅమర్‌నాథ్‌ గౌడ్, అభినవ కుమార్‌ చావల్లి తో పాటు ఎస్సీ వర్గానికి చెందిన గంగారావు, బ్రాహ్మణ కులానికి చెందిన డీవీ సోమయాజులు, కమ్మ కులానికి చెందిన విజయలక్ష్మి, వెలమ కులానికి చెందిన కేశవరావులను న్యాయమూర్తుల పోస్టులకు సిఫార్సు చేశారు. అయితే బీసీ, ఎస్సీ, బ్రహ్మణ వర్గానికిచెందిన వ్యక్తులకు వ్యతిరేకంగా చంద్రబాబు కేంద్ర న్యాయశాఖకు రిపోర్టులు పంపారు.

చంద్రబాబు పంపిన రిపోర్టుపై కేంద్ర ఇంటెలిజెన్స్ పరిశీలన చేసి ఏపీ ముఖ్యమంత్రి పంపిన రిపోర్టు తప్పు అని తేల్చారు. దీంతో వారు న్యాయమూర్తులుగా నియమించబడ్డారు. 2017 మార్చిలో చంద్రబాబు పంపిన ఈ తప్పుడు నివేదికలను ఇటీవల జస్టిస్ ఈశ్వరయ్య మీడియా ముందు బయటపెట్టారు. దాంతో బీసీలకు బాబు వెన్నుపోటు వెలుగులోకి వచ్చింది.