Home రాజకీయాలు మా అక్కను హేళన చేసేలా విజిల్స్ వేయిస్తావా…

మా అక్కను హేళన చేసేలా విజిల్స్ వేయిస్తావా…

80
SHARE

ఏవీ సుబ్బారెడ్డిపై భూమా అఖిలప్రియ సోదరి నాగమౌనిక ఫైర్ అయ్యారు. పద్దతి మార్చుకోవాలని ఏవీకి హెచ్చరించారు. ఆళ్లగడ్డ పంచాయితీ చేసేందుకు ఏపీ, అఖిలప్రియను చంద్రబాబు ఆహ్వానించగా.. అఖిలప్రియతో పాటు ఆమె సోదరి నాగమౌనిక, భూమా బ్రహ్మానందరెడ్డి కూడా అమరావతి వచ్చారు.

ఈ సందర్బంగా నాగమౌనిక మీడియాతో మాట్లాడారు. ఏవీ సుబ్బారెడ్డి రాజకీయంగా ఎదగాలనుకుంటే సహకరిస్తారని.. అఖిలప్రియను అణచివేసి ఎదగాలనుకుంటే మాత్రం అది అయ్యే పనికాదన్నారు. భూమా నాగిరెడ్డి సమాధి వద్దకు కూతుర్లు రాకుండా అడ్డుకున్నప్పుడే ఏవీతో తమకు సంబంధాలు తెగిపోయాయన్నారు.

మంత్రి హోదాలో ఉన్న అఖిలప్రియ దీక్షకు దిగితే.. మహిళ అన్నది కూడా చూడకుండా ఏవీ సుబ్బారెడ్డి మనషులు బైకులపై వచ్చి విజిల్స్ వేస్తూ, కేకలు వేస్తూ హేళన చేశారని.. దాన్ని ఎలా సమర్ధించుకుంటారని ప్రశ్నించారు.

దీన్ని చూసి భరించలేకే కొందరు ఏవీపై రాళ్ల దాడి చేసి ఉండవచ్చన్నారు. అలాంటి దాడులను తాము ప్రోత్సహించబోమన్నారు. ఇకపై భూమా అఖిప్రియను తాకాలంటే ముందుగా భూమా , ఎస్వీ కుటుంబసభ్యులను, ఆళ్లగడ్డ, నంద్యాలలోని భూమా అనుచరులను తాకాల్సి ఉంటుందని నాగమౌనిక హెచ్చరించారు.

అసలు అఖిలప్రియ ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఏవీ సుబ్బారెడ్డి ప్రత్యేకంగా కార్యక్రమాలు ఎలా చేస్తున్నారని నాగమౌనిక ప్రశ్నించారు. ఈ వ్యవహారాన్ని తేల్చాల్సిందిగా తామే పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నామని ఆమె చెప్పారు.